Movies

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఓ డిజాస్టర్ సినిమా.!

ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మన తెలుగు టీవీ ఛానెల్స్ వారు తమ ఆడియెన్స్ ను మెప్పించడానికి పలు సరికొత్త సినిమాలతో ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వస్తున్నారు. తాము తీసుకొచ్చే కొత్త సినిమాలను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేస్తారన్న సంగతి తెలిసిందే.

కానీ కొన్ని ఛానెల్స్ కు మాత్రం సరైన సినిమాలే దొరకడం లేదని చెప్పాలి. ఇప్పుడు స్టార్ మా కు కూడా అదే పరిస్థితి ఏమో? ప్రతి శుక్రవారం వెండితెర మీద కొత్త సినిమాలు ఎలా వచ్చేవో ఇప్పుడు బుల్లితెర మీద కూడా అదే ట్రెండ్ ను మొదలు పెట్టారు.

అలా ఈ శుక్రవారం స్టార్ మా లో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన “తిక్క” సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చెయ్యనున్నారు. కొన్ని ఛానెల్స్ కొన్ని యావరేజ్ సినిమాలను తీసుకొచ్చినా వీరు మాత్రం మరీ ఘోరమైన ప్లాప్ సినిమాను తీసుకొస్తున్నారు.

సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో అప్పుడే ఒక సాలిడ్ హిట్ పడిందన్న సమయంలో “తిక్క” సినిమా ఆ గ్రాఫ్ ను పోగొట్టింది. మరి ఈ స్మాల్ స్క్రీన్ పై ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."