Movies

మెగాస్టార్,స్టైలిష్ స్టార్ కలిసి నటిస్తున్నారు…ఏ సినిమాలో తెలుసా?

ప్రస్తుతానికి ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి, వరుసగా చిత్రాలు చేయడానికి నిర్ణయించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఆ తరువాత మలయాళం లో భారీ విజయాన్నినమోదు చేసుకున్నటువంటి లూసిఫెర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి చిరు నిర్ణయించుకున్నాడు. కాగా ఈ చిత్రాన్ని యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబందించిన ఒక లేటెస్ట్ వార్త సామాజిక మాంద్యమాల్లో గత కొద్దీ రోజులుగా వైరల్ అవుతుంది.

కాగా మలయాళ లూసిఫర్ చిత్రంలో మోహన్ లాల్ కి నమ్మినబంటు గా పృథ్వీరాజ్ సుకుమారన్ మెప్పించారు. అయితే తెలుగులో ఆ పాత్రను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనిపించనున్నారని భారీగా ప్రచారం జరిగింది. దానికి తోడు అల్లు అర్జున్ కూడా ఆ పాత్రలో కనిపించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. కానీ అసలు విషయం ఏంటంటే… అల్లు అర్జున్ కోసం వచ్చినటువంటి పుకార్లలో ఎలాంటి వాస్తవాలేమీ లేవని, అవన్నీ తప్పుడు వార్తలు అని బన్నీ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. అంతేకాకుండా బన్నీ ప్రస్తుతానికి సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే చిత్రంతో బిజీగా ఉన్నాడని, ఒకవేళ అలాంటి విషయాలు ఏమైనా ఉంటే తామే అధికారికంగా వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."