Movies

మహేష్ ఫ్యాన్స్ కు షాకిచ్చిన జెమినీ టీవీ….ఊహించని షాక్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఇటీవలే వంద రోజుల వేడుకను పూర్తి చేసున్న ఈ చిత్రం అన్ని రంగాల ప్లాట్ ఫామ్స్ లోనూ అరడగొట్టింది.

ముఖ్యంగా అయితే స్మాల్ స్క్రీన్ పై. ఈ ఏడాది ఉగాది రోజున జెమినీ ఛానెల్లో టెలికాస్ట్ కాబడిన ఈ చిత్రం అప్పటివరకు ఉన్న అన్ని టీఆర్పీ రికార్డులను తుడిచి పెట్టేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ డిలీట్ సీన్స్ మరియు ఇంకా హై క్వాలిటీ ఆడియోతో టెలికాస్ట్ చేస్తున్నామని తెలిపారు.

ఈ ఏప్రిల్ 26 ఆదివారం సాయంత్రం టెలికాస్ట్ చేస్తామని వారు తెలిపారు. కానీ ఇప్పుడు ఆ స్లాట్ నుంచి వారు ఈ చిత్రాన్ని ఇప్పుడు తొలగించి బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటించిన “రాక్షసుడు” సినిమాను పెట్టారు. ఇప్పటికే మైండ్ లో స్ట్రాంగ్ గా ఈ సినిమాను రెండో సారి కూడా అదే స్థాయిలో చూడాలని ఫిక్స్ అయ్యిపోయారు. కానీ తీరా చూస్తే జెమినీ ఛానెల్ వారు ఇలా ఊహించని షాక్ ఇచ్చారు.