లాక్ డౌన్ లో యాంకర్ రష్మీ ఏం చేస్తుందో చూసారా?
మన తెలుగు ఛానెల్స్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించే ఛానెల్స్ లో ఈటీవీ టాప్ లో ఉంటుంది. అలా ఈటీవీలో ప్రసారం అయ్యే టాప్ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన ఎంతో మందిలో యాంకర్ రష్మీ కూడా ఒకరు.కానీ ఇప్పుడు కరోనా కారణంగా షూటింగ్స్ అన్ని నిలిచిపోవడంతో తాను చేసే షోల షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి.
అలాగే ఇప్పుడు విధించిన లాక్ డౌన్ మూలాన రష్మీ కూడా తన ఇంటికే పరిమితం అయ్యింది. ఇదిలా ఉండగా తాను ఇంట్లో ఉండి చేసిన ఒక ఫన్నీ పనిని సోషల్ మీడియాలో పంచుకుంది. తన ఇంట్లో ఉండే కుక్కను పట్టుకొని దానితో చేసిన విన్యాసాలు చూస్తే ఎవరికైనా నవ్వు రాక మానదు. ఏదో చిన్న పిల్లాడిని ఎత్తుకొని తిరుగుతున్నట్టు దాన్ని పట్టుకొని అటు ఇటు తిరిగేస్తుంది. దానితో వర్కౌట్స్ చేస్తూ ఆ వీడియోను పెట్టింది. మొత్తంగా మాత్రం ఈ వీడియో మంచి ఫన్నీగా ఉంది.
