Movies

శ్రీ విష్ణు ఫెవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

తెలుగు విభిన్నమైన కథలను విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే కథానాయకులలో శ్రీవిష్ణు ఒకరుగా కనిపిస్తాడు. బ్రోచేవారెవరురా తర్వాత ఆ స్థాయి హిట్ ను అందుకోవడానికి ఆయన నానా తంటాలు పడుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ….. హీరోయిన్లు గ్లామర్ పరంగా, నటన పరంగా మంచి మార్కులు కొట్టేస్తున్నారు. పాత్రపై తమదైన ముద్ర వేస్తూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నారు. నేను పార్వతి మీనన్ నటనను ఎక్కువగా ఇష్టపడతాను.

ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది. ఎలాంటి పాత్రనైనా ఆమె చాలా సింపుల్ గా చేసేస్తారు. అందువలనే ఆమె చాలా తక్కువ కాలంలోనే మలయాళంలో బిజీ అయ్యారు. ఆమెతో కలసి నటించాలని ఉంది. ఇక కథానాయకుల విషయానికి వస్తే…. తెలుగులో హీరోలంతా ఇష్టమే… వెంకటేష్ అంటే మరి కొంచెం ఎక్కువ ఇష్టం. చదువుకునే రోజుల్లో అయన సినిమాలు వదలకుండా చూసేవాడిని బొబ్బిలిరాజా తర్వాత వెంకటేష్ గారి వీరాభిమాని అయ్యాను. ఆ అభిమానం ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది అని చెప్పుకొచ్చాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."