Movies

ఉదయ్ కిరణ్ ని దత్తత కోసం పేపర్స్ కూడా రెడీ చేసుకున్నాను… కానీ?

తెలుగు సినిమాల్లో తండ్రి పాత్ర అనగానే టక్కున గుర్తొచ్చే నటుడు ప్రకాశ్ రాజ్. .తల్లి పాత్రలు తలచుకోగానే ముందుగా మెదిలే పేరు సుధ. . ఐదువందలకు పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఆమె, తెలుగు , తమిళ చిత్రాల్లో ఆల్మోస్ట్ యువ హీరోలందరికి తల్లిగా నటించారు.. ఇటీవల ఒక యూట్యూబ్ చానెల్ నిర్వహాంచిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధ ఉదయ్ తో తనకున్న అనుబంధాన్ని గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

నటి సుధని చూడగానే ఏ తూర్పు గోదావరో , పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన వ్యక్తో అనుకుంటారు..అచ్చం మన తెలుగు వ్యక్తిగా తెలుగు వాళ్లల్లో కలిసి పోయిన సుధ స్వస్థలం తమిళనాడులోని శ్రీరంగం.. మాతృభాష తమిళం..సినిమాల్లోకి ఎంటర్ అయింది కూడా తమిళంలోనే..హీరోయిన్ గా బాలచందర్ దర్శకత్వంలో తెరంగేట్రం చేసిన ఆమె, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్తిరపడ్డారు. ఎక్కువ చిత్రాలు తెలుగు భాషలో చేయడంతో తెలుగింటి ఆడపడుచుగా, అమ్మగా స్థిరపడిపోయారు.

ఎన్నో సినిమాల్లో మహేశ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు,సూర్య, అజిత్ మరియు విక్రం ఇలా అందరి హీరోలకి తల్లిగా నటించిన సుధ..ఉదయ్ కిరణ్ కి తల్లిగా తొమ్మిది చిత్రాల్లో నటించారు. ఉదయ్ తెలుగులో నటించిన 19 చిత్రాల్లో 9చిత్రాల్లో తల్లికొడుకులుగా ఉదయ్, సుధ కలిసి నటించారు. ఆ అభిమానం, ప్రేమ వారిద్దరి మధ్య నిజమైన తల్లికొడుకుల బంధం ఏర్పడి ఉంటుంది

“తన కుటుంబ సభ్యులకంటే తనతో ఎక్కువ క్లోజ్ గా ఉండేవాడని అన్నారు సుధ. ఉదయ్ ని దత్తత తీసుకోవాలనుకున్నాను. దానికి ఉదయ్ కూడా ఒప్పుకున్నాడు.. ఉదయ్ చనిపోవడానికి రెండు నెలల ముందు దత్తతకి అంతా సిద్దం చేసుకున్నాం, ఆల్మోస్ట్ పేపర్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇంక దత్తత కార్యక్రమమే పెండింగ్ ఉంది. ఇంతలో ఇలా జరిగింది. అవకాశాలు లేక ఉదయ్ అలా చేశాడా అని అడిగిన ప్రశ్నకు.. అవకాశాలది ఏముందిరా.. ఏధైనా బిజినెస్ పెట్టిస్తాను.హాయిగా బిజినెస్ చూస్కుందువు, నా దగ్గరకి వచ్చేయ్ రా నాన్నా అన్నాను..వస్తాను అమ్మా అన్నాడు.ఇంతలోనే అంతటి ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు అని బాధపడ్డారు సుధ.