Nuvvu Nenu Movie:నువ్వు నేను సినిమాలో అనితకు హీరోయిన్ ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా ?
Nuvvu Nenu Movie: ఒక సినిమాలో చాన్స్ రావటం కష్టమే.. వచ్చిన చాన్స్ ని ఉపయోగించుకొని కెరీర్ బిల్డప్ చేసుకోవటం ఇంకా కష్టం. చిత్రం మూవీతో డైరెక్టర్ గా అవతారం ఎత్తి రికార్డ్ క్రియేట్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ తేజ అనగానే ఇండివిడ్యువాలిటీ గల డైరెక్టర్ గా చెబుతారు.
తనకు నచ్చకపోతే ఎలాంటి సినిమా అయినా వదిలేస్తాడు. పైగా ఇటీవల కాలంలో దర్శకత్వం వహిస్తున్నటువంటి కొన్ని చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పాలవుతున్నాయి.దీంతో తేజ కథల విషయంలో కొంతమేర ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.
ప్రస్తుతం తేజ రానా కాజల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.తొలిమూవీ ‘చిత్రం’ తర్వాత యితడు చేసిన రెండవ మూవీ నువ్వు నేను మూవీ అప్పట్లో ఓ సంచలనం. కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది. అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా ఉదయ్ కిరణ్, అనిత నటించారు.
ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకోవడంతో పాటు దర్శక నిర్మాతలకు కూడా కాసుల వర్షం కురిపించింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ గమ్మత్తైన విషయాన్ని దర్శకుడు తేజ ఆడియన్స్ తో పంచుకున్నాడు.
నువ్వు నేను మూవీలో నటించే హీరోయిన్ విషయమై అప్పట్లో కొందరు ఆర్టిస్టులను ఇంటర్వ్యూ చేసామని ఇందులో భాగంగా ఆర్టిస్ట్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేయడంతో ఆమె పలురకాల షరతులను విధించిందని దాంతో తేజ ఆమె ద్వారా మరో ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేయించి ఆమెని సినిమాలో హీరోయిన్ గా నటింప చేశామని, ఆ విధంగా నువ్వు నేను చిత్రంలో హీరోయిన్ గా అనిత ని ఎంపిక చేశామని తేజ గుర్తు చేసుకున్నాడు.
అలాగే అనితని ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసిన సమయంలో ఆమె అప్పుడప్పుడే సినీ పరిశ్రమకి వచ్చిందని, అయినప్పటికీ కొన్ని సన్నివేశాల్లో అనిత చాలా బాగా నటించిందని చెప్పుకొచ్చాడు.


