MoviesTollywood news in telugu

Tamanna:తమన్నా తొలి పారితోషికం తెలిస్తే షాకవుతారు..ఏమి చేసిందో తెలుసా..?

Tollywood Heroine Tamanna:శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయ మయిన మిల్కీ బ్యూటీ తమన్నా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. అప్పట్లో మంచు మనోజ్‌తో కలిసి కేవలం 15 ఏళ్ల వయసులోనే తమన్నా నటించింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో హిట్ కొట్టి, బద్రీనాథ్‌తో తెలుగులో పాగా వేసింది.

మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుని అన్ని ఇండస్ట్రీలలో తమన్నా దుమ్ము లేపింది. ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంటూ ఇప్పటికీ అదే స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న తమన్నాతో ఇప్పుడు సినిమా చేయాలంటే కోట్లు సమర్పించుకోవాల్సిందే.

ఓ హీరోయిన్‌కు ఈ రోజుల్లో ఐదేళ్ల స్టార్ డమ్ ఉంటేనే వీరలెవెల్లో కటింగ్ ఇస్తున్నారు. అలాంటిది ఒకటిన్నర దశాబ్ధం నుంచి తమన్నా సినిమాలు చేస్తూనే ఉన్నా ఇంకా ఆమె క్రేజ్ తగ్గలేదు. ఒక్క తెలుగులోనే కాదు అన్ని చోట్లా ఈ అమ్మడికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూనే ఉంది.

పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే తమన్నా సినిమాల్లోకి వచ్చేసిన తమన్నా స్క్రీన్‌పై కనిపించింది.ఈ మధ్యే ఓ ఇంటర్వూలో తమన్నా మాట్లాడుతూ తొలిసారి అందుకున్న రెమ్యునరేషన్ గురించి చెప్పింది.

సినిమాల్లోకి రాకముందు ఓ కమర్షియల్ యాడ్ చేసిన తమన్నా పగలు పది పరీక్షలు రాస్తూ , మధ్యాహ్నం కనీసం పార్లర్ కూడా వెళ్లకుండా 2 నుంచి 10 గంటల వరకు మూడు రోజుల పాటు కమర్షియల్ యాడ్ చేసింది .2005లో జరిగిన ఈ యాడ్ కోసం మూడు రోజులు షూట్ చేస్తే, లక్ష రూపాయల పారితోషికం అందుకుంది.తనకు వచ్చిన ఆ లక్ష రూపాయలను ఫ్యామిలీతోనే ముఖ్యంగా కాఫీ షాప్‌కు వెళ్లి ఎంజాయ్ చేసానని మిల్కీ బ్యూటీ చెప్పింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."