Movies

సినిమాలకు ఓటీటీ దారి తప్పదా… పరిస్థితులు అలానే ఉన్నాయా…?

వేసవి వచ్చిందంటే సినిమాల విడుదల హడావిడి ఉంటుంది. స్టార్ వార్ జరుగుతుంది. కానీ ఈసారి కరోనా మహమ్మారి కారణంగా అన్ని ఆగిపోయాయి. సుదీర్ఘ లాక్‌ డౌన్‌ కారణంగా మూడు నెలలుగా థియేటర్లు ఓపెన్‌ అవ్వలేదు. దీంతో ఇండియాలోనే కొన్ని వందల సినిమాలు విడుదల వాయిదా పడ్డాయి. కేవలం జనవరి నెలలో మాత్రమే సినిమాలు విడుదల అయ్యాయి. దీంతో మొత్తానికి ఈసారి కరోనా వైరస్‌ సంవత్సరం మొత్తాన్ని తినేసింది. థియేటర్ల గురించి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పట్లో మాట్లాడవద్దంటూ స్పష్టంగా చెప్పేయడంతో సినిమా ప్రముఖులు కూడా ఇప్పట్లో థియేటర్లు ఓపెన్‌ చేయకున్నా పర్వాలేదు అంటున్నారు.

ఈ కారణంగానే రాబోయే మూడు నెలల వరకు థియేటర్లు ఓపెన్‌ అయ్యే అవకాశం లేదని క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే మూడు నెలలు మరో మూడు నెలలు అంటే మొత్తం ఆరు నెలలు. ఈ ఆరు నెలల కాలం పాటు రెడీ అయిన సినిమాలను విడుదల వాయిదా వేయడం నిజంగా నిర్మాతకు తలకు మించిన ఆర్థిక భారం అనే చెప్పాలి.

అయితే కొత్తగా వచ్చిన ఓటీటీని సినిమావాళ్లు ఆశ్రయిస్తున్నారు. ఎంతోకొంత రాబట్టుకుంటే చాలు అన్నట్లుగా కొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ ఓటీటీకి తమ సినిమాలను ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు.పెంగ్విన్‌ తో పాటు పలు సినిమాలు ఇప్పటికే ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యాయి ఈ జాబితాలో కేవలం సౌత్‌ నుండి పాతిక సినిమాలు చేరే ఛాన్స్ ఉందని టాక్. బాలీవుడ్‌ లో కూడా ఓటీటీ రిలీజ్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే మరో రెండు నెలలు ఓటీటీకి పండుగే అంటున్నారు. మొత్తం మీద ఓటీటీలో భారీ ఎత్తున సినిమాలు రిలీజ్‌ అవ్వడం ఖాయం అని తేలింది.