Movies

మోక్షజ్ఞ…ఎంట్రీ పై నీలినీడలు తొలగిపోయాయా …?

దేనికైనా హద్దు,సహనం ఉంటాయి .. సినిమా హీరోల విషయంలో మాత్రం ఫాన్స్ కి ఆలాంటివేవీ ఉండవ్ .. అందుకే నందమూరి నట వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఫాన్స్ అలా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవలే అరవైవ పడిలో పడినా సరే, తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి నటసింహం బాలయ్య బాబుకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. నిజానికి బాలకృష్ణ ప్రస్తుతం ఫ్లాప్, హిట్లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే గత కొద్ది కాలంగా బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడనే వార్తలు వస్తున్నా సరే, మోక్షజ్ఞ మాత్రం బయట కనిపించినప్పుడల్లా బాలయ్య అభిమానులను కలవర పెడుతూనే ఉన్నాడు.

అయితే ఇటీవలే నందమూరి బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు వేడుకలను బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో పేషంట్ల మధ్య నిరాడంబరంగా జరుపుకున్న నేపథ్యంలో ఈ వేడుకలకు మోక్షజ్ఞ, నారా బ్రాహ్మణి , చంద్రబాబు తదితరులు హాజరయ్యారు. సరిగ్గా అప్పుడే కొంతమంది నెటిజన్లు ఎక్కువగా మోక్షజ్ఞ పై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో మోక్షజ్ఞ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.అంతేగాక సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తావు మోక్షజ్ఞ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇక బాలయ్య మాత్రం గతంలో మోక్షజ్ఞ టాలీవుడ్ సినీ ఎంట్రీ ఈ విషయంపై స్పందిస్తూ సినిమాల్లో ఎంట్రీ విషయం పూర్తిగా మోక్షజ్ఞపైనే ఆధారపడి ఉంటుందని, ఒకవేళ మోక్షజ్ఞ కి సినిమాల్లోకి రావడానికి ఇష్టం లేకపోతే తాను ఏమాత్రం బలవంతపెట్టని చెప్పుకొచ్చాడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా అప్పట్లో మోక్షజ్ఞ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడని కూడా టాక్ నడిచింది. ఎందుకంటే, … హీరోలను సినీ పరిశ్రమకు పరిచయం చేయడంలో పూరి స్టైలే వేరు.అందువల్లనే టాలీవుడ్ సినీ అభిమానులు ఈ వార్తలన్నీ నిజమని భావించారు. కానీ మోక్షజ్ఞ ను చూస్తుంటే,ఫాన్స్ కి వేరేలా అనిపించడమే కాకుండా క్లారిటీ లేకుండా పోవడానికి కారణమని అంటున్నారు.