మెగా ఇంట పెళ్లి సందడి ఫొటోతో పెళ్లి కన్ఫర్మ్ చేసిన నిహారిక
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ వరుసగా పెళ్లికి సిద్ధమవుతున్నారు. మెగా ఫ్యామిలీ మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారిక పెళ్లి పై క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ఒక్కగానొక్క కొడుకు తో నిహారిక పెళ్లి జరిపించారని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆదివారం రోజు ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఎంగేజ్ మెంట్ ఆగస్టు లో పెళ్లి 2021 ఫిబ్రవరిలో చేయటానికి ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఈ పెళ్లి వార్త నిజమని నిహారిక పెట్టిన పోస్ట్ చూస్తే అర్థమవుతుంది.
ఒక కప్ పెట్టి ఆ కప్ మీద miss.niha ఉంటె miss ని క్యాన్సిల్ చేసి mrs ? ఉన్న ఫోటో పెట్టటంతో నిహారిక పెళ్లి టాపిక్ వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూస్తే నిహారికకు పెళ్లి ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. ఆ ఫోటో అర్థం నిజంగానే పెళ్ళి ఫిక్స్ అయిందా లేక ఏదైనా మూవీ ప్రమోషన్ అనేది నిహారిక కానీ మెగా ఫ్యామిలీ కానీ ఇంతవరకు క్లారిటీ ఇస్తే కానీ సస్పెన్స్ వీడదు.

