Movies

25 ఏళ్ల తరవాత మళ్ళీ….ఈ సేంట్ మెంట్ వర్క్ అవుట్ అవుతుందా…పాపం అఖిల్ ?

తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఈయన నటవారసుడిగా అక్కినేని నాగార్జున ఫీల్డ్ లోకి వచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచాడు. అయితే నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మాత్రం ఇంకా తానేమిటో ప్రూవ్ చేసుకోలేదు. ఇంట్లో వాళ్ళు ఇతడి కెరీర్ గురించి లోతుగానే దృష్టిపెట్టారు. ఎలాగైనా ఇండస్ట్రీలో నిలబెట్టాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే మూడు సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ మూడూ కూడా బ్లాక్ బస్టర్ కాలేకపోయాయి. దాంతో హిట్ కోసం తపిస్తున్నాడు. నాన్న నాగార్జున, అన్నయ్య నాగచైతన్య ఫాన్స్ మాత్రం అఖిల్ ని ఆదరించడానికి సిద్ధంగానే ఉన్నారు. మంచి మూవీ కోసం ఫాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి అఖిల్ ఒకే చెప్పాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా దీనికి పేరు పెట్టారు.

నిజానికి ఈ మూవీ ఏప్రియల్ లో విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా తేడా కొట్టింది. ఇక భాస్కర్ కి కూడా వరుస ప్లాప్ లు రావడం వలన అఖిల్ ఫాన్స్ లో ఆందోళన నెలకొంది. ఈ మూవీలో అఖిల్ తల్లిగా సీనియర్ నటి ఆమని నటిస్తోంది. అఖిల్ బుడిబుడి అడుగులు వేసే సమయంలో సిసింద్రీ సినిమాలో అక్షర తల్లిగా ఆమని నటించింది. సిసింద్రీ మూవీలో సీన్స్ గుర్తొచ్చేలా ఈ సినిమా రివీల్ కాబోతోందట. మళ్ళీ 25ఏళ్ళ తర్వాత ఆమని ఇలా అఖిల్ తల్లిగా నటించడం సెంటిమెంట్ అయింది.