Movies

ప్రభాస్ తో జోడీకి దీపికాపదుకొనే కండిషన్స్ ఏమిటో తెలుసా ?

సాహో తర్వాత ‘జిల్’ డైరెక్టర్ రాధాకృష్ణ తో కల్సి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా చేస్తున్న సినిమా ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే అర్ధాంతరంగా వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా కూడా ఫిక్స్ అయింది. దీనికి ”మహానటి” ఫిల్మ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి కూడా. పాన్ ఇండియా మూవీ లెవల్లో ఈ సినిమా వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ నిర్మించబోతున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ప్రతి రోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది .ముఖ్యంగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో బాగా హైలెట్ అవుతుంది. ప్రభాస్ జోడీగా ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత దీపిక మహానటి గురించి ప్రస్తావించడం, ఆ ప్రస్తావన లో నాగ్ అశ్విన్ కొనసాగించడంతో.. కచ్చితంగా ఈ మూవీలో దీపికా పడుకొనే హీరోయిన్ గా ఫిక్స్ అయిందని టాక్. తాజాగా దీపికా పడుకొనే ఈ సినిమాలో నటించేందుకు ఊహించని కండిషన్ పెట్టిందట.

అందుకు అంగీకరిస్తే ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదు .ఇంతకీ ఆ కండిషన్ ఏంటంటే ఈ చిత్రంలో నటించడానికి ఆమె రెమ్యూనరేషన్ కాకుండా హిందీ థియేట్రికల్ రిలీజ్ రైట్స్ కూడా ఇవ్వాలని వత్తిడి చేస్తోందట. ఎందుకంటే, సాహో చిత్రానికి హిందీ లో భారీగా బిజినెస్ జరిగింది. ఈ లెక్కన చూస్తే ఈ చిత్రానికి ఇంకా భారీగా బిజినెస్ ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. ఈలెక్కన చూస్తే, దాదాపు ఈ చిత్రానికి 50 కోట్ల వరకూ తన రెమ్యునరేషన్ను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ప్రొడ్యూసర్ ఒప్పుకుంటారా లేదా అనేది క్లారిటీ రావాలి.