ఇళయరాజా భార్యతో ఎలా ఉంటాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు
సినీ హీరోలు తమ భార్యలకు ఎక్కువ విలువ ఇవ్వరని,రకరకాలుగా వ్యవహరిస్తారని అంటుంటారు. భార్యలకు తెలీకుండా కొన్ని పనులు చేస్తారని అంటారు. అన్ని విషయాలు ఇంట్లో వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తుంటారు. అగ్ర హీరోలు, అగ్ర దర్శకులు,అగ్ర సంగీత దర్శకులైనా ఎవరైనా సరే ఇలాగే ఉంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.
అయితే సంగీత దర్శకులలో తనకంటూ ఓ ప్రత్యేకత సంతరించుకున్న మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా అన్ని విషయాలు భార్యకు చెప్పిన తర్వాత సినిమాలు చేస్తారట. ఏ విషయం కూడా చెప్పకుండా చేయరట. ఆమె సలహాలు తీసుకోవడంతో పాటు ఆర్ధిక వ్యవహారాలు కూడా ఆమెకే అప్పజెపుతారట.
అంతేకాకుండా తన భార్యకు కావాల్సినవన్నీ దగ్గరుండి ఇళయరాజా చూస్తారట. ఆమె లేకుండా ఆయన ఎక్కడికి వెళ్లేవారు కాదని తెలిసిన వారంతా చెప్పేమాట. ఎవరైనా ఫంక్షన్స్ కి పిలవడానికి వస్తే, ఇద్దరూ కలిపి రావాలని ఆహ్వానం ఆమెకే ముందుగా ఇస్తారట. భార్య అంటే అమితమైన గౌరవం గల ఇళయరాజాను చాలామంది ఆదర్శంగా తీసుకుంటున్నారట.

