టాలీవుడ్ ఆంటీల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి
హీరోయిన్స్ కంటే అమ్మ,ఆంటీ పాత్రలకు టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఒకేసారి నాలుగైదు ప్రాజెక్ట్స్ చేతిలో ఉంటాయి. అందుకే ఒకప్పుడు హీరోయిన్స్ గా వెండితెరను ఈలేసిన హీరోయిన్స్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ ,ఆంటీ పాత్రల్లో ఒదిగిపోతూ ఓ వెలుగు వెలిగేస్తున్నారు.
ప్రగతి,పవిత్ర లోకేష్ వంటి మహిళా నటులకు కూడా అమ్మా, అత్తా పాత్రలకు మంచి డిమాండ్ ఉండేది. కానీ లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు వీళ్లంతా కష్టాల బారిన పడ్డారన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాకా వీళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంతా ఇచ్చేవారు. కానీ ఇలా డిమాండ్ చేసేవాళ్లను పక్కన పెట్టాలని దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారట.
ప్రగతికి గతంలో ఒక్కో సినిమాకు 50లక్షలు కూడా ఇచ్చిన సందర్భాలున్నాయని, ఇప్పుడు అంత యివ్వలేమని అంటున్నారట. అలాగే పవిత్ర లోకేష్ ని కూడా భరించలేమని అంటున్నారట. సీరియల్స్ లో చేసి మీడియం రేంజ్ లో ఉండేవాళ్ళను అమ్మా, అత్తా పాత్రలకు ఎంపిక చేయాలని భావిస్తున్నారట.

