వకీల్ సాబ్ లో కీలక పాత్రలో ఈ స్టార్ హీరోయిన్ నటిస్తుందా ?
పవన్ కళ్యాణ్ రాజకీయాలోకి వెళ్లి మరల వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ హిట్ మూవీ పింక్ రిమేక్ గా వస్తుంది. ఈ సినిమాలో నటిస్తున్న నటుల గురించి పెద్దగా సమాచారం లేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్నాడు. కథ ప్రకారం ఈ మూవీలో ముగ్గురు అమ్మాయిల పాత్రలు కీలకం. అందులో ఒక పాత్రలో నివేద థామస్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ అంజలి కూడా నటిస్తుందని ఒక టాక్ నడుస్తుంది. ఈ సినిమా నుంచి ఒక వర్కింగ్ స్టిల్ లీక్ అయ్యింది. పవన్ వెనుక స్టాండ్ లో కూర్చోని ఉన్న ఓ అమ్మాయి ఉంది. అస్పష్టంగా ఉన్న ఆమె ముఖం చూస్తుంటే…హీరోయిన్ అంజలి అనిపిస్తుంది. అయితే దీనిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది.
