Movies

బాల కృష్ణ సినీ కెరీర్ లో పీక్ దశ ఎప్పుడో తెలుసా ?

నందమూరి నటవారసుడిగా 1984లో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి నట సింహం బాలకృష్ణ ఎన్నో బ్లాక్ బస్టర్స్, రికార్డ్స్ క్రియేట్ చేసాడు. తన నటనతో ఫాన్స్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వచ్చిన బాలయ్య 105సినిమాల్లో చేసాడు. మంగమ్మగారి మనవడు సినిమాతో స్టార్ హీరోగా ఎదిగిన బాలయ్య నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చాడు. ఆ ఏడాది సంచలన ఓపెనింగ్స్ తో ఆరు హిట్స్ క్రియేట్ చేసాడు. మళ్ళీ 1989లో ముద్దుల మావయ్య, 1992లో రౌడీ ఇనస్పెక్టర్, మూవీస్ తో రికార్డ్స్ క్రియేట్ చేసిన బాలయ్యకు 1999 -2004పీక్ టైమ్ అని చెప్పాలి.

రెండు ఇండస్ట్రీ హిట్స్,మూడు కమర్షియల్ హిట్స్,మూడు సినిమాలతో ఓపెనింగ్స్ క్రియేట్ చేసి తెలుగు సినిమాకు 15కోట్లు, 20కోట్లు షేర్ వసూలు చేసి, 20కోట్లు,30కోట్లు గ్రాస్ చూపించిన బాలయ్య శకం ఇది. ఈ ఐదేళ్లలో 12సినిమాలు రిలీజయ్యాయి. 1999లో వచ్చిన సమరసింహారెడ్డి సంచలన విజయంతో బాలయ్య ప్రభంజనానికి శ్రీకారం చుట్టింది. 92కేంద్రాల్లో 50రోజులు,73సెంటర్స్ లో 100రోజులు,33సెంటర్స్ లో 175రోజులు మొదటి సారి ప్రదర్శితమై 15కోట్ల షేర్ కొల్లగొట్టింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమాతో నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చేసాడు.

ఇక అదే ఏడాది సుల్తాన్ ఓపెనింగ్స్ అదరగొట్టిన ఏవరేజ్ గా నిల్చింది. అలాగే కృష్ణబాబు కూడా నిరాశపరిచింది. 2000లో వంశోద్దారకుడు,గొప్పింటి అల్లుడు వచ్చాయి. ఇందులో గొప్పింటి అల్లుడు కమర్షియల్ గా సేఫ్ అయింది. 2001లో నరసింహనాయడు 100కేంద్రాల్లో 100రోజులు ఆడింది. 20కోట్లకు పైనే షేర్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిల్చి,సౌత్ ఇండియాను షేక్ చేసింది. ఆతర్వాత భలేవాడివి బాసూ ప్లాప్ అయినా, 2002లో వచ్చిన సీమసింహం ఓపెనింగ్స్ లో సంచలనం క్రియేట్ చేసింది. ఇక చెన్నకేశవరెడ్డి మూవీ హిట్ కోసం పొట్టేళ్లను బలిచ్చారంటే బాలయ్య క్రేజ్ గురించి తెలుసుకోవచ్చు. 2003లో బ్రహ్మనాయుడు అంచనాలను అందుకోలేకపోయింది. 2004లో లక్ష్మీ నరసింహ ఓపెనింగ్స్ అదరగొట్టేసింది. 84సెంటర్స్ లో వంద రోజులు ఆడింది. సీడెడ్ లో 16కోట్లు షేర్ ఓ రికార్డ్.