రామ్ “రెడ్” సినిమాకి బంపర్ అఫర్ ఎన్ని కోట్లో…?
మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ హీరోగా చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిన విషయమే. ఈ సినిమా విజయంతో రామ్ తన హ్యాట్రిక్ సినిమాల దర్శకుడు తిరుమల కిషోర్ తో “రెడ్” అనే సినిమా ప్రారంభించాడు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాలి. అయితే కరోనా కారణంగా విడుదల ఆగిపోయింది.
ఈ సినిమాతో పాటుగా ఎన్నో సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. వీటిలో కొన్ని OTT బాట పట్టాయి. మరికొన్ని ధియేటర్స్ లో విడుదల కోసం ఎదురుచూస్తున్నాయి. రెడ్ సినిమాకు కొన్ని రోజుల క్రితం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ 20 కోట్లకు పైగానే ఆఫర్ ఇచ్చింది అని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ మరో ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ దగ్గరగా 30 కోట్ల వరకు ఆఫర్ చేసారట. అయితే OTT కి ఇవ్వటానికి దర్శక నిర్మాతలు సిద్ధంగా లేరట.
