Movies

టాలీవుడ్ లో మెప్పించిన బాలీవుడ్ భామలు…ఇంత మంది ఉన్నారా…?

సినిమా అన్నాక హీరోతో పాటు హీరోయిన్,విలన్,ఇతర క్యారెక్టర్ యాక్టర్స్,ముఖ్యంగా కమెడియన్స్ కూడా ముఖ్యమే. అన్నీ కుదిరితేనే సినిమా హిట్ . అయితే ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువ. అందుకే ఎంత టాలెంటెడ్ హీరోయిన్ అయినా కొంతకాలం మాత్రమే నిలబడేది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ఒకే ఇండస్ట్రీకి పరిమితం అవకుండా భాషతో సంబంధం లేకుండా ఇరత భాషల చిత్రాల్లోనూ ఛాన్స్ వస్తే వదలకుండా నటిస్తుంటారు. ఇలా చూస్తే ఒకప్పుడు శ్రీదేవి,జయప్రద లాంటివాళ్లు హిందీలోకి వెళ్లి తమ సత్తా చాటారు. ఇక ముఖ్యంగా బాలీవుడ్ నుండి టాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్లు చాలా ఎక్కువమందే ఉన్నారు. బాలీవుడ్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ నగ్మా ‘పెద్దింటి అల్లుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ‘కిల్లర్’ ‘ఘరానా మొగుడు’ ‘వారసుడు’ ‘మేజర్ చంద్రకాంత్’ ‘ముగ్గురు మొనగాళ్లు’ ‘కొండపల్లి రాజా’ వంటి హిట్ మూవీతో టాలీవుడ్ లో పాతుకుపోయింది.

ఇక ‘కూలీ నెం.1’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన మరో సీనియర్ హీరోయిన్ టబు ఆ తర్వాత ‘నిన్నేపెళ్లాడుతా’ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ‘ఆవిడా మా ఆవిడే’, ‘పాండురంగడు’, ‘చెన్నకేశవ రెడ్డి’, ‘అందరివాడు’ ‘ఇదీ సంగతి’ వంటి మూవీస్ లో నటించిన టబు ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో మరోసారి టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చింది. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా టబుకి తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఆతర్వాత బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే ‘మురారి’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి,.. ‘ఇంద్ర’, ‘ఖడ్గం’ ,’పల్నాటి బ్రహ్మనాయుడు’, ‘మన్మథుడు’ ,’శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ‘ప్రేమంటే ఇదేరా’ ‘రాజకుమారుడు వంటి తెలుగులో’ సినిమాల్లో నటించిన ప్రీతీ జింటా రెండు సినిమాలతోనే ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ అంజలా ఝవేరీ ‘చూడాలని ఉంది’ ,’సమరసింహారెడ్డి’, ‘రావోయి చందమామ’ ,’దేవిపుత్రుడు’ వంటి సినిమాలలో నటించింది. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు ఇండీస్ట్రీకి పరిచయమైన కాజల్ అగర్వాల్ ‘చందమామ’ ‘మగధీర’ ‘ఆర్య 2’ ‘డార్లింగ్’ ‘బృందావనం’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘బిజినెస్ మాన్’ ‘బాద్‍ షా’ ‘ఎవడు’ ‘టెంపర్’ ‘ఖైదీ నెం 150’ సినిమాలతో టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. కొత్త హీరోయిన్స్ ఎంతమంది వస్తున్నా తనకంటూ ఇండస్ట్రీలో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఆఫర్స్ కొట్టేస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ లో నటిస్తోంది. ఇక ‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా దాదాపు అందరు స్టార్ హీరోస్ తో నటించి, తమన్నా 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇలా చాలామంది బాలీవుడ్ తారలు తెలుగులో మెప్పించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."