అభిమానులనే పెళ్లి చేసుకున్నస్టార్ హీరోలు ఎవరో చూడండి
Heoes Married Fans:కంటికి కనిపించకుండా మనసులో పుట్టే ఒక మధురమైన భావన ప్రేమ.. అందుకే ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో చెప్పలేం..స్థాయి ,సంపదలతో సంబంధం లేకుండా కొందరి మధ్య ప్రేమ పుడుతుంది.. ఈ ప్రేమకి సెలబ్రిటీలు కూడా అతీతులు కారు.. కానీ స్టార్ డమ్ ని అనుభవిస్తున్న సినిమా స్టార్స్ వారి అభిమానులతో ప్రేమలో పడడం నిజంగా గ్రేట్.
అలాంటి అరుదైన ప్రేమకథలు.. తమ అభిమానులనే పెళ్లి చేసుకున్న నటుల ప్రస్తావన వస్తే, భలే రంజుగా ఉంటుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, అతని భార్య లతా రంగాచారి..వీరిద్దరి పరిచయం అనూహ్యం. తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన లతతో సూపర్ స్టార్ ప్రేమలో పడ్డారు.ఎథిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్ధిగా ఉన్నప్పుడు లత సూపర్ స్టార్ ని ఇంటర్వ్యూ చేశారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో 26 ఫిబ్రవరి 1981 న తిరుపతిలో వారి పెళ్లయింది.
బాబీ సినిమాతో బాలివుడ్లో అడుగుపెట్టన నటి డింపుల్ కపాడియా..అదే ఏడాది బాలివుడ్ యాక్టర్ రాజేశ్ కన్నాని పెళ్లాడింది. అప్పటికి రాజేశ్ కన్నా సినిమాల నుండి రిటైర్ అయిపోయారు..కానీ రాజేష్ అంటే ఉన్న అభిమానంతో తనని డింపుల్ పెళ్లిచేసుకుంది. వాళ్ళ కూతురే ట్వింకిల్ కన్నా.. ఆమె అక్షయ్ కుమార్ ని వివాహం చేసుకుంది. ఈషా డియోల్ , భరత్ తక్తాని అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. ఇక ఈషా డియోల్ కి భరత్ పెద్ద ఫ్యాన్ .. వారి పరిచయం ప్రేమగా మారి,పెళ్ళికి దారితీసింది.
కాగా సఖి, యువ , అమృత ఇలా ఎన్నో చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిన నటుడు మాధవన్..తన భార్య సరితా బిజ్రేని కమ్యునికేషన్ స్కిల్స్ క్లాస్ లో కలుసుకున్నాడు. నటనకు ముందు మాధవన్ కమ్యునికేషన్ స్కిల్స్ కి సంబంధించిన క్లాస్ టీచ్ చేసేవాడు. అక్కడ స్టూడెంట్ గా ఉన్న సరితా బిజ్రేకి మాధవన్ క్లాస్ పట్ల ప్రత్యేక ఆసక్తి కనపర్చేది..మాధవన్ టీచింగ్ స్కిల్స్ పట్ల అట్రాక్ట్ అయిన సరితా..తర్వాత మాధవన్ తో ప్రేమలో పడడంతో పెళ్లిపీటలెక్కారు.
తమిళ నటుడు విజయ్ ని ఒక సినిమా షూటింగ్ సందర్బంగా సంగీత కల్సింది విజయ్ అన్నా,తన యాక్టింగ్ అన్నా పిచ్చి అభిమానం అని చెప్పడంతో, ఆటోగ్రాఫ్ తో పాటు ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఆ పరిచయం ఫోన్ కాల్స్,ఛాటింగ్స్ వరకు వెళ్లింది.తర్వాత సంగీతని తన ఇంటికి ఇన్వైట్ చేసి,ఇంట్లో వాళ్లకి పరిచయం చేశాడు..పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లిచేసుకున్నారు.
Click Here To Follow Chaipakodi On Google News

