Healthhealth tips in telugu

షుగర్ ఉన్నవారు నిమ్మరసం తాగొచ్చా? తాగితే ఏమవుతుందో తెలుసా?

Diabetes Food Lemon In Telugu : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ వచ్చిందంటే జీవిత కాలం మందులు వేసుకోవలసిందే. అలా మందులను వాడుతూ కొన్ని ఆహారాలను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే కొన్ని ఆహారాలను తినకూడదు.
lemon benefits
మధుమేహం ఉన్నవారికి మేలు చేసే ఆహారాల్లో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయను తగిన మోతాదులో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. డయాబెటిస్ ఉన్నవారిలో రోగనిరోదక శక్తి తక్కువగా ఉంటుంది. దాంతో తరచుగా ఏదో ఒక అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు.
నిమ్మకాయలో ఉండే విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతాయి.
Diabetes diet in telugu
అలాగే ఫైబ‌ర్ కంటెంట్ ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచుతుంది.అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు ఒక స్పూన్ నిమ్మరసం తీసుకుంటే మంచిది. డయాబెటిస్ ఉన్నవారిలో జీర్ణ సమస్యలు వస్తు ఉంటాయి. ఇలా నిమ్మరసం తీసుకుంటూ ఉంటే గ్యాస్, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి సమస్యలు కూడా ఉండవు.
lemon juice side effects in telugu
డయాబెటిస్ ఉన్నవారిలో తరచుగా అలసట,నీరసం వంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. నిమ్మకాయలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉంటుంది. అందువల్ల భోజనం తిన్న తర్వాత రక్తంలో చక్కెర మరియు ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది.
Diabetes In Telugu
డయాబెటిస్ ఉన్నావృలో విటమిన్ సి తక్కువ స్థాయిలో ఉంటుంది. అందువల్ల నిమ్మరసం తీసుకుంటే విటమిన్ సి కొంతవరకు భర్తీ అవుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ విషయంలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు మందులు వాడుతూ ఇలాంటి ఆహారాలను తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."