టాలీవుడ్ స్టార్ హీరోని గుర్తు పట్టారా…అయితే ఆలస్యం చేయకుండా చూసేయండి
నందమూరి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తక్కువ కాలంలోనే తన టాలెంట్ తో యంగ్ టైగర్ గా ఎదిగాడు. డాన్స్,ఫైట్స్ తో అదరగొడుతూ వరుస విజయాలను నమోదుచేస్తున్నాడు. అందుకే నందమూరి అభిమానుల్లో తారక్ కి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. మధ్యలో కొన్ని సినిమాలు దెబ్బతినడంతో పలు జాగ్రత్త్తలు తీసుకుని సినిమాలు చేస్తున్నాడు.
తారక్ సలార్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా సినిమా చేయనున్నాడు.ఓల్డ్ పిక్స్ సోషల్ మీడియాలో పెడుతూ ఫాన్స్ తో తన సంతోషాన్ని షేర్ చేసు కుంటున్నాడు. అదే విధంగా తాజాగా ఓ పిక్ వైరల్ అవుతోంది. చిన్ని కృష్ణుని వేషంలో ఉన్న ఫోటో అది .ఈ పిక్స్ ని ఫాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వేగంగా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం Devara సినిమాతో బిజీగా ఉన్నాడు. మంచి కధలను ఎంచుకుంటూ ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క యాడ్స్ చేస్తూ రెండు వైపులా సంపాదిస్తున్నాడు.


