Movies

వెబ్‌ సిరీస్‌లకు హీరోయిన్స్‌ పారితోషికం ఎలా తీసుకుంటారో తెలుసా?

ప్రస్తుతం చిన్న హీరోయిన్స్,పెద్ద హీరోయిన్స్,బడా నిర్మాతలు,హీరోలు అందరూ వెబ్ సిరీస్ వెంట పడుతున్నారు. వెబ్‌ సిరీస్‌ల బడ్జెట్స్‌ మరియు హీరోయిన్స్‌ తీసుకునే పారితోషికాలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలియదు. వారి కోసం ఈ వివరాలు. వెబ్ సిరీస్ లో నటిస్తే పాటలు ఉండవు,తక్కువ డేట్స్ ఇస్తే సరిపోతుంది. వెబ్‌ సిరీస్‌ నటీనటులకు రోజు వారి పారితోషికం ఇవ్వటం జరుగుతుంది. ఎక్కువగా ఇలానే జరుగుతుంది. హీరోయిన్ స్టార్ హోదాను బట్టి పారితోషికం అనేది నిర్ణయిస్తారు.

అయితే కొంత మంది హీరోయిన్స్ అయితే వెబ్ సిరీస్ మొత్తానికి ఇంత అని మాట్లాడుకుంటారు. కాని ఎక్కువ శాతం హీరోయిన్స్‌ మాత్రం రోజుల లెక్కలోనే ప్రస్తుతానికి పారితోషికంను అందుకుంటున్నారు.కోటి హీరోయిన్‌కు ఒక వెబ్‌ సిరీస్‌లో కీలక పాత్రలో నటించినందుకు గాను 20 నుండి 30 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది.