Movies

ఎక్కువ రోజులు ఆడిన టాప్ టెన్ మూవీస్…. ఒకసారి చూసేయండి

అన్ని రంగాల్లో మార్పుల మాదిరిగా సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సినిమా ఎన్ని రోజులు,ఎన్ని కేంద్రాల్లో ఆడింది వంటివాటిని బట్టి సినిమా హిట్ నిర్ణయించేవారు. అయితే ఇప్పుడు బడ్జెట్ ఎంత, ఎంత అమ్మారు, ఎంత వసూలు చేసింది అనేదాన్ని బట్టి డిసైడ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు 50రోజులు మించి ఆడడం కష్టంగా ఉంది. కాగా టాప్ టెన్ మూవీస్ విషయానికి వస్తే, సి పుల్లయ్య,ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లవకుశ అప్పట్లో 1111రోజులు ఓ థియేటర్ లో ఆడడంతో రికార్డ్ క్రియేట్ చేసింది. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు,దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు కాంబోలో తెరకెక్కిన ప్రేమాభిషేకం మూవీ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. గుంటూరు,విజయవాడ,వైజాగ్ లలో 300రోజులు ఆడింది. ఓ థియేటర్ లో 533రోజులు ఆడింది.

ఎన్టీఆర్ ,కె రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన వేటగాడు మూవీ అప్పట్లో ఓ థియేటర్ లో 408రోజులు ప్రదర్శించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అడవి రాముడు ఓ థియేటర్ లో 365రోజులు ప్రదర్శించారు. బాలయ్య నటించిన లెజెండ్ మూవీ ప్రొద్దుటూరు అర్చనా ధియేటర్ లో 1005రోజులు ఆడింది. బాలయ్య ,కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మంగమ్మగారి మనవడు హైదరాబాద్ కాచిగూడలోని తారకరామా థియేటర్ లో 557రోజులు ఆడింది. ఇక కమల్ హాసన్,సరిత కాంబినేషన్ లో కె బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన మరో చరిత్ర మూవీ కూడా ఓ థియేటర్ లో 556రోజులు ఆడింది.

విజయ, టి రాజేందర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఓ థియేటర్ లో 465రోజులు ప్రదర్శించారు. ఇక దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన మగధీర మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. కర్నూల్ లోని ఓ థియేటర్ లో 1001రోజులు ఆడింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు,పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ కొట్టిన పోకిరి మూవీ కర్నూల్ లోని ఓ థియేటర్ లో 1001రోజులు ప్రదర్శించారు.