Vikramarkudu:రవితేజ కెరీర్ ని మలుపు తిప్పిన విక్రమార్కుడు…ఎన్ని కోట్లు వసూలు చేసిందో ?
Vikramarkudu Movie:మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా అనగానే విక్రమ్ రాధోడ్ పాత్రతో అదరగొట్టిన విక్రమార్కుడు మూవీ గుర్తొస్తుంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ 7భాషల్లో డబ్ అయింది. 26కోట్ల గ్రాస్,18కోట్ల షేర్ వసూలు చేసింది. వైజాగ్ ,గుంటూరులలో పోకిరి తర్వాత విక్రమార్కుడు రెవెన్యూ పరంగా సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది.
ఛత్రపతి మూవీ తరువాత సొంతంగా బ్యానర్ పెట్టి, ముద్ర పేరిట జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మూవీ తీయడానికి జక్కన్న ప్లాన్ చేసాడు. దానికి బడ్జెట్,సమయం ఎక్కువే అవుతాయని, అందుకే ఈలోగా ఓ మూవీ చేసి, తర్వాత సొంత బ్యానర్ పెట్టాలని అనుకుని విజయేంద్ర ప్రసాద్ రాసిన స్టోరీస్ తిరగేస్తుంటే,ఓ పోలీస్ స్టోరీ చాలా ఆసక్తిగా కనిపించింది. అయితే పవర్ స్టార్ అయితే ఇండస్ట్రీ హిట్ కొట్టొచ్చని పవన్ కళ్యాణ్ ని కలిసాడు. ఇప్పుడు గ్యాప్ లో ఉన్నాను తర్వాత చేద్దాం అని సున్నితంగా తిరస్కరించాడు.
దాంతో ఎప్పటినుంచొ మూవీ చేయాలని ఎదురుచూస్తున్న రవితేజ గుర్తొచ్చాడు. దాంతో కలవడం ఒకే అవ్వడంతో అతడి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు కొన్ని మార్పులు అవసరమని భావించి, వినోదం కోసం అత్తిలి సత్తిబాబు క్యారెక్టర్ చేర్చి ,15రోజుల్లో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసారు. ఎం రత్నం డైలాగ్స్ రాసారు. ఇక రవితేజ 20రోజులు రాథోడ్ క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అయ్యాడు.
సూపర్ మూవీలో చేసిన అనుష్కను హీరోయిన్ గా సెలెక్ట్. చంబల్ లోయ స్టోరీ కనుక చాలామంది బాలీవుడ్ నటులను చూసి వినీత్ కుమార్ ని ఎంపికచేశారు. హీరో ఫ్రెండ్ వేషాలు వేసే అజయ్ ని కిట్ల అనే భయంకర విలన్ కోసం తీసుకున్నాడు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. 2005డిసెంబర్ 11న అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ స్టార్ట్ చేసారు. తారక్,ప్రభాస్ చీఫ్ గెస్ట్ లు గా వచ్చారు. రామోజీ ఫిలిం సిటీ,రాజేంద్రనగర్ క్వారీ ,కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతంలో షూటింగ్ చేసారు.
కేవలం 5నెలల్లో 90పనిదినాల్లో షూటింగ్ పూర్తి. క్వారీలో షూటింగ్ సమయంలో తమకు పనులు లేవంటూ కూలీలు రాళ్లు విసరడంతో యూనిట్ సభ్యులకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. 11కోట్ల బడ్జెట్ అయింది. 2006మే 31న ఆడియో లాంచ్ చేసి,జూన్ 23న మూవీ 180ప్రింట్స్ తో భారీగా రిలీజ్ చేసారు. రవితేజ ఇమేజ్ ,జక్కన్న క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.
చావంటే భయపడ్డానికి గల్లీలో తిరిగే వాడిని కాను రాధోడ్,విక్రమ్ రాధోడ్ వంటి డైలాగ్స్ చూసి అందరూ స్టన్ అయ్యారు. ఒక్కో సీన్ చూస్తుంటే రవితేజా యేనా అని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికే పోకిరి ప్రభంజనంలో ఉన్న జనాలకు నచ్చేలా చేసి విక్రమార్కుడు సూపర్ కలెక్షన్స్ తెచ్చింది. ఇక 6భాషల్లో 5సార్లు రీమేక్ అవ్వడం ఈ సినిమా ప్రత్యేకత. ఇక 2006లో టాప్ 5గ్రాసర్స్ లో ఒకటిగా నిల్చి 54కేంద్రాల్లో 100రోజులు ఆడింది.

