టాలీవుడ్ హీరోల బాట ఒకేలా ఉందా…మరి ఎందుకు కంగారు పడ్డారు
మహమ్మారి కరోనా ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వాక్సిన్ వస్తుందో కానీ అన్ని రంగాలు కుదేలయిపోయాయి. ఎక్కడ చూసినా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. వరుసగా మూడు లాక్ డౌన్ లు అయ్యాక అన్ లాక్ ప్రక్రియ స్టార్ట్ అయింది. కొన్ని రంగాలకు సడలింపు లు ఇవ్వడంతో అతి పెద్ద ఇండస్ట్రీ అయిన టాలీవుడ్ లో కూడా సినిమా షూటింగ్స్ కి పర్మిషన్స్ ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి,దగ్గుబాటి సురేష్ ,దిల్ రాజు వంటి ప్రముఖులంతా అటు తెలంగాణా సీఎం కేసీఆర్ , ఇటు ఎపి సీఎం వైఎస్ జగన్ లను కల్సి చేసిన విజ్ఞప్తి మేరకు కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు.
కరోనా నిబంధనల్లో భాగంగా భౌతిక దూరం ఉండాలి.. శానిటైజ్ చేసుకోవాలి.. గ్లౌసెస్ వాడడం, సమూహాలుగా చేరకుండా చూసుకుంటూ ఇన్డోర్ షూటింగ్ చేసుకోవాలి.. ఇక 60ఏళ్ళు దాటిన వాళ్లకు ,10ఏళ్ళ లోపు పిల్లలకు ఛాన్స్ లేదు… ఇలా నియమాలు పెట్టడంతో ఇవన్నీ పాటించి షూటింగ్ చేయడం కష్టమనే స్థితికి కొందరు ముందే వచ్చేసారు. ‘నా వలన ఒక్క వ్యక్తి కూడా కరోనా బారిన పడకూడదు. ఎప్పుడు పరిస్థితులు అనుకూలిస్తే అప్పుడే షూటింగ్ చేస్తా’అని దగ్గుబాటి సురేష్ ప్రకటించేసారు. అది కుదిరేలా కనిపించడం లేదు. వీటితోనే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లోని ఇండస్ట్రీలు ఇక వయస్సు నిబంధన విషయం తీసుకుంటే, తెలుగులో చిరంజీవి,వెంకటేష్,బాలయ్య, నాగార్జున వంటి స్టార్ హీరోస్ కి నో ఛాన్స్ .
అలాగని 50కి అటూ ఇటూగా ఉన్న పవన్, మహేష్ బాబు , బన్నీ, చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు కూడా షూటింగ్స్ ఇప్పట్లో నో అనేస్తున్నారు. పోనీ యంగ్ హీరోలున్నారు కదా అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, అందునా కేసులు పెరిగిపోతున్న సమయంలో భౌతిక దూరం పాటించి షూటింగ్ అనేది కుదరని పని. ఇక దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కూడా కరోనా బారిన పడడంతో స్టార్ డైరెక్టర్స్ కూడా జంకుతున్నారు. కమెడియన్ పృథ్వి కూడా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఎలా చూసినా ఇప్పట్లో షూటింగ్స్ కష్టమే . వాక్సిన్ ఎప్పుడొస్తే అప్పుడే అన్నట్లు కొందరి వాదన. ఇంతకీ ఏమిచేస్తారో చూడాలి.
