మోచేతుల నలుపుని మాయం చేసే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ ఇవే!
How to lighten dark elbows: స్లీవ్‌లెస్ లేదా షార్ట్ హ్యాండ్స్ డ్రెస్సులు వేసుకోవాలంటే ఆలోచిస్తున్నారా? దానికి కారణం మోచేతుల నలుపేనా? అయితే మీరు ఫీల్ అవ్వాల్సిన పనే లేదు, ఎందుకంటే చాలామంది ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్ ఇది. ఎండ, రాపిడి, డెడ్ స్కిన్ సెల్స్ వల్ల మోచేతులు నల్లగా, గరుకుగా మారుతుంటాయి.
కానీ, మన ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే ఈ సమస్యకు సులువుగా చెక్ పెట్టొచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా, న్యాచురల్‌గా మోచేతుల నలుపుని తగ్గించే బెస్ట్ హోమ్ రెమెడీస్ ఏంటో ఇక్కడ చూద్దాం!
మనలో చాలా మంది మోచేతుల నలుపు సమస్యతో బాధపడుతూ ఉంటారు. చర్మం ఎంత తెల్లగా,అందంగా ఉన్న మోచేతుల వద్ద నల్లగా ,రఫ్ గా ఉండుట వలన చాలా ఇబ్బందిగా ఉంటుంది.

ఈ నలుపును పోగొట్టుకోవడానికి అనేక రకాల క్రీమ్స్ అనేక ప్రయత్నాలు చేసిన పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.
ముందుగా నిమ్మకాయను సగం కట్ చేయాలి. కట్ చేసిన నిమ్మ ముక్కను ఉప్పులో అద్ది.మోచేతులకు రెండు నిమిషాల పాలు రుద్దాలి. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా మోచేతుల నలుపు తగ్గిపోతుంది. కాస్త శ్రద్ద సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
శనగపిండిలో పెరుగు కలిపి పేస్ట్‌లా చేయాలి.ఈ మిశ్రమాన్ని మోచేతులకు రాసి పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మంపై ఎక్స్‌ఫోలియేట్‌లా పనిచేస్తుంది.తద్వారా మోచేతుల నలుపు తగ్గడంతో పాటు.మృదువుగా కూడా మారుతుంది. శనగపిండిని చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

