Movies

ఎడమచేతి వాటంగల సెలబ్రిటీలు ఎంత మంది ఉన్నారో తెలుసా ?

ఈ ప్రపంచంలో చాలామందికి కుడిచేతి వాటమే ఉంటుంది. అయితే 20శాతం మందికి ఎడమ చేతి వాటం ఉంటుంది. మనదేశంలో అయితే 15శాతం మందికి ఎడమచేతి వాటం ఉందని అంచనా. ఇక ప్రతియేటా ఆగస్టు 13న వరల్డ్ లెఫ్ట్ హాండ్స్ డే గా నిర్వహిస్తారు. ఎడమచేతి వాటం ఉన్నవాళ్ళ లో గొప్పవాళ్ళు లేకపోయినా, చాలామంది గొప్పవాళ్ళలో ఎడమచేతి వాటం ఉంటుంది. చాలామంది సెలబ్రిటీలకు లెఫ్ట్ హ్యాండ్ వాటం ఉంది.

ఇండియా పారిశ్రామిక దిగ్గజం భారత రత్న రతన్ టాటా ఎడమ చేతివాటమే. ఎడమచేతి వాటం గల ప్రతిభగల వారికి టాటా సంస్థ స్కాలర్ షిప్ కూడా అందిస్తోంది. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా ఎడమచేతి వాటమే. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకన్ బర్గ్ కూడా ఎడమ చేతి వాటమే. మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా ఎడమచేతి వాటమే. బాలీవుడ్ భామ సన్నీ లియో కూడా లెఫ్ట్ హ్యాండ్ వాటమే.

ఎడమచేతి వాటంలో మొదటి సెలబ్రిటీగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ పేరు గుర్తొస్తుంది. చాలా సినిమాల్లో ఇది తెల్సి పోతుంది. ఇక అభిషేక్ బచ్చన్ కూడా లెఫ్ట్ హ్యాండ్ వాటమే.”నేను లెఫ్ట్ హ్యాండ్ వాడొచ్చు. కానీ నెప్పుడూ రైటే’అని సచిన్ టెండూల్కర్ చమత్కరించారు. మహానటి సావిత్రి ఎడమచేతితో రాస్తున్న ఫోటో ఫేమస్ అయింది. ఇంకా చెప్పుకుంటూ పొతే,అరిస్టాటిల్,ధీరూభాయ్ అంబానీ,లాంటి ప్రముఖులెందరో లెఫ్ట్ హ్యాండ్ వాడేవారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."