Movies

ఔను..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమా వెనక ఉన్న నమ్మలేని నిజాలు… ఎన్ని కోట్ల లాభమో ?

ఈ సినిమా పేరు చెబితే ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అందులోని జోకులు,హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ, సాంగ్స్ అన్నీ సూపర్.వెన్నెల్లో హాయి హాయి సాంగ్ ఆరోజుల్లో పాడుకొని వాళ్ళు లేరు. వంశీ మళ్ళీ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. చక్రి కెరియర్ కి స్పీడ్ అందుకుంది. రవితేజకు హ్యాట్రిక్ హిట్. కృష్ణ భగవాన్ కి ఆనందం. కొండవలసకు పునాది పడింది. ప్రేమించు పెళ్లాడు,లేడీస్ టైలర్,అన్వేషణ వంటి ఎన్నో హిట్ మూవీ అందించిన వంశీ కి ఆతర్వాత అన్నీ అపజయాలే. దాంతో ఇండస్ట్రీ వదిలేసి దూరంగా వెళ్లిపోవాలని అన్నీ ప్యాక్ చేసేసి,ఇల్లు కూడా ఖాళీ చేసేసాడు. చేతిలో 500ఉంటె,భార్యాబిడ్డలను తీసుకుని యానాం వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో అక్కడి వారికి తెలియదు. వాళ్ళతో ఆయనకి పనిలేదు. రైటర్ వేమూరి సత్యనారాయణ,స్వాతి ఎడిటర్ వేమూరి బలరాం,హీరో జెడి చక్రవర్తి తప్ప ఎవరూ ఫోన్ కూడా చేసేవారు కాదు. ఈలోగా వేమూరి సత్యనారాయణ నుంచి ఫోన్ వచ్చింది. హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ బానే ఉందని, మా ఊరికి చెందిన వేమూరి రమేష్ నీతో సినిమా తీస్తాడట అని చెప్పడంతో బయలుదేరి వెళ్ళాడు. అందరూ పలకరింపులు అయ్యాయి. స్క్రిప్ట్ రాస్తుంటే వేమూరి రమేష్ అమెరికా వెళ్ళిపోయాడు. వంశీ పరిస్థితి మళ్ళీ అయోమయం.

ఈలోగా నిర్మాత జయకృష్ణ ఓ మలయాళ సినిమాను వేణు తో తెలుగులో రీమేక్ చేయాలని ఆఫర్ ఇచ్చారు. లవ్ ఇన్ రామోజీ ఫిలిం సిటీ పేరుతొ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలెట్టేసాడు. అప్పటికే నాలుగైదు ప్రాజెక్ట్స్ వలన జయకృష్ణ ఆర్ధిక ఇబ్బందుల వలన ఈ సినిమా స్టార్ట్ కాలేదు. ఇంకో ఇద్దరు ప్రొడ్యూసర్స్ తో ప్రపోజల్స్ వచ్చినా ముందుకి వెళ్ళలేదు. దాంతో తానే సొంతంగా చేయాలనీ భావించి రెండు మూడు నెలలు ఎవరికీ కన్పించలేదు. గంగోత్రి ఉపాధ్యాయ చెప్పిన కథను బేస్ చేసుకుని ఓ స్క్రిప్ట్ రెడీ చేసి, హీరో శివాజితో మూవీ చేయాలను కున్నాడు. ఇద్దరు ముగ్గుర్ని నిర్మాణం కోసం కదిపినా పనవ్వలేదు. ఈలోగా మహర్షి మూవీకి ప్రొడక్షన్ మేనేజర్ గా చేసిన వల్లూరిపల్లి రమేష్ నిర్మాతగా మారాలని అనుకుంటున్నాడు. దాంతో వంశీతోనే మూవీ చేయాలని రమేష్ రెడీ అయ్యాడు. శ్రావణి సుబ్రహ్మణ్యం చేసి, ఇడియట్ లో నటిస్తున్న రవితేజ అయితే బెటర్ అనుకున్నాడు. రవితేజ కూడా ఒకే.

హీరోయిన్ గా లయ అనుకున్నా,శేషు మూవీలో చేసిన కళ్యాణి అయితే బాగుంటుందని భావించారు. కాకినాడకు చెందిన పాపారావు చౌదరిని రైటర్ గా,నటుడిగా చేసి, కృష్ణ భగవాన్ గా పేరు మార్చింది కూడా వంశీయే. ఏప్రియల్ 1విడుదల మూవీలో విలనిజం చేయించిన వంశీ కొత్తగా తీసే సినిమాలో కామెడీ వేషం ఇచ్చాడు. విశాఖ పోర్టులో పనిచేసి రిటైరైన కొండవలస లక్ష్మణరావు కి నాటక అనుభవం ఉండడంతో అయితే ఒకే అనే డైలాగ్ బాగా ప్రాక్టీస్ చేయించి ఈ సినిమాలో తీసుకున్నారు. హీరో హీరోయిన్స్ పేర్లు స్వాతి పత్రికలోనివే. ఇక ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు టైటిల్ పెట్టి, ఆనవాయితీగా బాపుతో టైటిల్ రాయించారు.

హీరోకి రాత్రి ఉద్యోగం,హీరోయిన్ కి పగలు ఉద్యోగం. అందుకే పగలూ రాత్రి థీమ్ తో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులు,రంగులు వేయించా లని నిర్ణయం. ఇంటికోసం వెతుకుతుంటే,సారధి స్టూడియోలో బ్లాక్ అండ్ వైట్ ఫిలిం లాబ్ ఉండగా,అది వంశీకి నచ్చేసింది. 35వేలతో ఇల్లు డిజైన్. అదికూడా వంశీ సామాన్ల తోనే. 80శాతం షూటింగ్ అక్కడే. మిగిలిన భాగం పాపికొండలు,అరకు వెళ్లారు. 35రోజుల్లో సినిమా పూర్తి. ఇక ఇందులో కట్టిన కాటన్ సారీస్ చాలా బాగున్నాయని కళ్యాణి షూటింగ్ ఆఖరి రోజున చెప్పడంతో అన్నీ పట్టుకుపొమ్మన్నాడు. పట్టుచీరలు ఇచ్చినంత ఆనందంగా పట్టుకెళ్లింది. 2002ఆగస్టు 2న సినిమా రిలీజ్. అయితే వంశీ షిరిడీలో ఉన్నాడు. కృష్ణ భగవాన్ ఫోన్ చేసి గురువుగారు మన సినిమా హిట్ అంట అని పెట్టేసాడు. చిన్న సినిమాల్లో పెద్ద హిట్.