Kitchen

సింపుల్ గా బాదం హల్వా ఇలా చేసుకోండి

పిల్లలను బాదంపప్పు తినమంటే మారాం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా హల్వా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు హల్వా కి కావలసిన పదార్థాలు, ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలు
బాదం పప్పు ఒక కప్పు
పంచదార అర కప్పు
నీళ్లు ఆరు కప్పులు
నెయ్యి అర కప్పు

పొయ్యి మీద గిన్నె పెట్టి నాలుగు కప్పుల నీటిని పోసి దానిలో బాదంపప్పులను వేసి మంట ఎక్కువ పెట్టి ఎనిమిది నుంచి పది నిమిషాలు ఉడికించాలి. బాదం పప్పు ఉడికాక పై తొక్క తీసేయాలి. తొక్క తీసిన బాదం పప్పులను మెత్తని పేస్ట్ గా చేయాలి. బాదం పేస్ట్ పక్కన పెట్టుకుని, పొయ్యి వెలిగించి ఒక పాన్లో పావు కప్పు నీటిని పోసి పంచదార వేసి బాగా కరిగేవరకు కలపాలి. మరొక పాన్లో నెయ్యి వేసి బాదం పేస్ట్ వేసి సిమ్ లో పెట్టి బాగా కలపాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరికి వచ్చాక పంచదార పాకాన్ని వేయాలి. పంచదార పాకం బాదం బాగా కలిసే లాగా కలపాలి. ఎలా అంటే నెయ్యి సపరేట్ అయ్యే వరకు కలపాలి. అంతే వేడివేడిగా బాదం హల్వా రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."