Movies

ఆ సినిమాలో నటించటం నా అదృష్టం అంటున్న రోజా…ఆ సినిమా ఏమిటో ?

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, హీరోయిన్ అయినా, నటులైన సరే, వాళ్లకి కూడా నచ్చిన మూవీస్ ఉంటాయి. అలాంటి సినిమాల్లో చేయడం నిజంగా గొప్ప అదృష్టంగా ఫీలవుతారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ప్రేమ తపస్సు మూవీ ద్వారా టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రోజా ఆతరవాత ఎన్నో సినిమాల్లో నటించింది. పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో శోభన్ బాబు హీరోగా ‘సర్పయాగం’ సినిమాలో శోభన్ బాబు కూతరు పాత్రలో మంచి మార్కులే కొట్టేసింది. అందరి హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. సీతారత్నం గారి అబ్బాయి, ముఠామేస్త్రీ సినిమాల్లో రోజా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక బాలకృష్ణ హీరోగా నటించిన ‘భైరవ ద్వీపం’ సినిమా రోజాను స్టార్ హీరోయిన్‌ గా నిరూపించింది.

మరోవైపు రాజకీయాల్లో కూడా చేరి,టిడిపిలో కీలక పాత్ర పోషించిన రోజా ఆతర్వాత పరిణామాల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి,జగన్ కి విధేయురాలిగా ఉన్నారు. ఇంకోవైపు జబర్దస్త్ కామెడీ షో జడ్జిగా సత్తా చాటుతోంది. ఇంకా ఎన్నో టివి షోస్ కూడా చేసింది. చిత్తూరు జిల్లా నగరి నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికైన రోజా ప్రతిపక్షంలో ఉంటూ టిడిపిని విమర్శిస్తూ ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడింది. గత ఎన్నికల్లో మరోసారి నగరి నుంచి గెలవడమే కాదు, 151సీట్లతో జగన్ అధికారంలోకి రావడంతో రోజా అధికార పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో విపక్ష టీడీపీ మీద విమర్శలు గుప్పిస్తోంది. ఎపి ఐ ఐ సి చైర్మన్ గా కూడా నియమితులయ్యింది.

ఇలా ఒకవైపు రాజకీయాలను మరోవైపు సినిమాలు, టీవీలకు సంబంధించిన ప్రోగ్రామ్‌లను, ఇంకోవైపు కుటుంబాన్ని అన్ని బాధ్యతలను రోజా సమానంగా నిర్వహిస్తోంది. ఎంత రాజకీయాల్లో ఉన్నా సినిమాల వల్లే ఇంత పాపులారిటీ ఆమెకు వచ్చిందన్నది నిజం. ఇక ఎన్నో సినిమాల్లో నటించిన రోజా కు వ్యక్తిగతంగా సంతృప్తి ఇచ్చిన చిత్రం ‘అన్నమయ్య మూవీ అని ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించింది. ఈ మూవీలో రోజా ప్రధాన కథానాయికగా నటించకపోయినా.. శ్రీ వేంకటేశ్వర స్వామిపై తెరకెక్కిన ‘అన్నమయ్య’ చిత్రంలో నటించడం తన భాగ్యమంటూ వ్యాఖ్యానించింది. ఆ ఏడు కొండలస్వామి దయ వల్లే ఆయన నీడన ఉన్న నగరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టు కూడా చెప్పుకొచ్చింది.