ఎన్టీఆర్ ఫ్యామిలీ నుండి మరో నటుడు ఎంట్రీ…ఎవరో చూడండి
రాజకీయాల్లో,నటనలో వారసత్వానికి కొదవలేదు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఎంతమందికి ఉన్నా సరే, వారసులదే హవా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది స్టార్స్ తమ వారసులను సినీ ఇండస్ట్రికీ దించేశారు. నందమూరి,అక్కినేని,అలాగే మెగా స్టార్ ఫ్యామిలీ ,దగ్గుబాటి ,సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ ఇలా అందరూ రంగ ప్రవేశం చేసి రాణిస్తున్నారు. మూడో తరం వాళ్ళు,దగ్గర బంధువుల పిల్లలు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నట్లు వైరల్ అవుతోంది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎపుడు ఇస్తాడా అని నందమూరి ఫాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ కూడా బాలయ్యఇవ్వగా, టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ఇంటి నుంచి మరో నట వారసుడు టాలీవుడ్‌లో ఎంట్రీ అనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా లో చేస్తున్న తారక్ ఆ తర్వాత త్రివిక్రమ్, ఆపై ప్రశాంత్ నీల్‌తో వరుస ప్రాజెక్టులకు సైన్ చేసాడు. తారక్ భార్య లక్ష్మి ప్రణతి తమ్ముడు టాలీవుడ్‌లో నటుడిగా ఎంట్రీ అనే మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస రావు గత ఎన్నికల సమయంలో వైయస్ఆర్సీపీలో చేరారు.
ఇప్పుడు కొడుకుని సినిమాల్లో ఎంట్రీ ఇప్పించడానికి నార్నే శ్రీనివాసరావు కసరత్తు చేస్తున్నాడు. అయితే ఎవరి దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇస్తాడా అనేది క్లారిటీ లేదు. బావ మరిది ఎంట్రీ విషయంలో ఎన్టీఆర్ ప్రమేయం ఏమైనా ఉందా లేదా అనేది మాత్రం తెలియదు. కానీ కొంత మంది మాత్రం ఎన్టీఆర్ అండదండలతోనే బావ మరిది సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ బావ మరిది .. డాన్సుల్లో ఫైట్స్‌లో ట్రెయినింగ్ అవుతున్నాడట. బావ మరిది సినీ భవిష్యత్తుకు తారక్ బాటలు వేస్తాడా లేదా అనేది చూడాలి.
