Movies

విజయ్ దేవరకొండ పారితోషికం మొదటి సినిమా నుండి..ఎన్ని లక్షల నుండి ఎన్ని కోట్లు పెరిగిందో ?

ఒక్కో స్టార్ కి ముందు ఒక్కో పదం ఉంటుంది. కానీ రౌడీ స్టార్ అనే స్టార్ ఇండస్ట్రీలో ఉన్నాడని తెలుసా? పెళ్లి చూపులు మూవీతో ఎంట్రీ ఇచ్చి అర్జున్ రెడ్డితో గుర్తింపు పొంది,గీత గోవిందం మూవీతో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ తక్కువ టైం లో ఎక్కువ పేరు కొట్టేసాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి వందకోట్ల క్లబ్ లో చేరిపోయాడు. అందుకే బాలీవుడ్ తారలు కూడా విజయ్ ని ఇష్టపడతారు. దీనికి కారణం దేశవ్యాప్తంగా విజయ్ దేవరకొండ కు అర్జున్ రెడ్డి మూవీ క్రేజ్ తెచ్చింది. తెలుగు సినిమాల్లో అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ సినిమా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించి సాహసం చేసాడని అప్పట్లో అందరూ కీర్తించారు. అందులో విజయ్ దేవరకొండ ముఖ్య పాత్ర పోషించాడు. నిజానికి ఎవడే సుబ్రహ్మణ్యం ద్వారా మంచి నటుడనిపించుకుని అర్జున్ రెడ్డి ద్వారా విజయ్ స్టార్ అయ్యాడు .

అంతేకాదు,ప్రతి సినిమాకి తన పాపులారిటీ తో పాటు పారితోషకం కూడా పెరిగింది. విజయ్ సోలో హీరోగా నటించిన మొదటి సినిమా పెళ్లిచూపులు. ముందు బడ్జెట్ అసలు సరిపోలేదు అని దాంతో విజయ్ దేవరకొండ బంధువైన యష్ రంగినేని నిర్మాణంలో కొంత పాత్ర పోషించారని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో తెలిపారు. ఆ సినిమాకి విజయ్ అందుకున్న పారితోషకం ఐదు లక్షలు మాత్రమే. ఆ మూవీతో విజయ్ కి గుర్తింపు రావడంతో ద్వారకా లాంటి కమర్షియల్ సినిమా చేసి,20 లక్షలు అందుకున్నాడు. నిజానికి పెళ్లిచూపులు తర్వాత మొదలై న అర్జున్ రెడ్డి షూటింగ్ సమయంలో ఇబ్బందుల వలన 5లక్షలు విజయ్ అందుకున్నాడు. పెళ్లిచూపులు తర్వాత విజయ్ సైన్ చేసిన గీత గోవిందం మూవీ సమయానికి అర్జున్ రెడ్డి విడుదల కాలేదు. దాంతో ఐదు లక్షలు పారితోషకం తీసుకున్నాడు.

తమిళ్ లో రూపొంది తెలుగులోకి అనువాదం అయిన నోటా కు – 3 కోట్లు తీసుకున్నాడు సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు అనుకున్నంతగా కాకపోయినా ఒక మోస్తరుగా ఆడిన టాక్సీ వాలా సినిమా యావరేజ్ గా నిలిచింది. దీనికి 5 కోట్లు అందుకున్నాడు. తెలుగులో రూపొంది తమిళ, కన్నడ, మలయాళ, భాషల్లో కూడా విడుదలైన డియర్ కామ్రేడ్ సినిమా థియేటర్లలో సరిగ్గా ఆడలేదు.10 కోట్లు ముట్టింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకి 10 కోట్లు అందుకున్నాడు. 4భాషల్లో వచ్చిన ఈ సినిమా చూస్తే అర్జున్ రెడ్డి సినిమాకి సీక్వెల్ ఏమో అనిపిస్తుంది. ఇక పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చేస్తున్న ఫైటర్ సినిమా మీద ప్రేక్షకులందరికీ భారీగా అంచనాలు ఉన్నాయి. 12కోట్లు అందుకోబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా రాబోతోంది.