Movies

ఆదిపురుష్ లో ప్రభాస్ గెటప్ రాముడేనా…అసలు ట్విస్ట్ అదేనంట

బాహుబలి,సాహో భారీ చిత్రాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి మళ్ళీ ఆలాంటి మూవీ ఏది వస్తుందా అని ఫాన్స్ ఎదురుచూస్తున్న తరుణంలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ”ఆదిపురుష్” అనే స్ట్రెయిట్ హిందీ సినిమా ప్రకటించేశాడు. ఇందులో ప్రభాస్ హీరోగా ప్రకటన రావడమే కాదు,పోస్టర్ కూడా వచ్చేసింది. ‘చెడుపై మంచి సాధించిన విజయం’ అనే థీమ్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ లో రాముడు విల్లు ఎక్కుపెట్టినట్లు, పది తలల రావణుడు, గదతో దూసుకొస్తున్న హనుమంతుడు, మునులు మొత్తం మీద ఏదేదో ఇతిహాసగాథ రామాయణాన్ని తలపించేలా డిజైన్ చేసారని చెప్పాలి.

ఇప్పటికే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతి బ్యానర్ లో ఓ సినిమా కూడా రాబోతోంది. అందుకే నాగ అశ్విన్ ఈ పోస్టర్ ని చూసి,… ‘ప్రభాస్ ని తెరపై రాముడిలా చూడబోతుండడం ఎగ్జైటింగ్ గా ఉంది. గతంలో కొంతమంది నటులు మాత్రమే ఆ పాత్రను చేయగలిగారు’ అని ట్వీట్ చేసాడు. 3-డీ లో రూపొందనున్న ఈ సినిమాలో మొత్తానికి రాముడిగా నటిస్తున్నాడనే వార్తల్లో వాస్తవం ఉందని అంటున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉందన్న మాట వినిపిస్తోంది.

‘ఆది పురుష్’ రామాయణాన్ని ఆధారం చేసుకుని రూపొందిస్తున్నప్పటికీ పూర్తిగా ‘రామాయణం’ కాదని, కేవలం కొద్దిసేపు ప్రభాస్ ‘రాముడు’గా మెరుస్తాడని టాక్. అయితే డైరెక్ట్ గా ప్రభాస్ తో రాముడు గెటప్ వేయించకపోయినా, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంటర్ ఫేజ్ లో ప్రభాస్ ని రాముడుగా చూపించడమో చేస్తారని అంటున్నారు.రాముడి కంటే ముందు జరిగిన ఎపిక్ హిస్టరీల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా మళ్ళీ పురాణ పురుషుడి పాత్రలు వెండితెరపై కనిపించడం ఈ జనరేషన్ లో గ్రేట్ అవుతుందని అంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."