Movies

ప్రభాస్ స్టార్ డైరెక్టర్స్ వైపు అసలు చూడటం లేదు…కారణం ఇదేనట

రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటవారసత్వాన్ని అందిపుచ్చుటకున్న ప్రభాస్ ఎన్నో హిట్ మూవీస్ చేసి స్టార్ హీరో అయ్యాడు. ఇక ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాలతో వరల్డ్ వైడ్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా అతడిని ఉన్నత శిఖరాలకు చేర్చింది. అయితే ఆతర్వాత వచ్చిన సాహో అనుకున్న రేంజ్ ని చేరుకోలేదు. ఫాన్స్ ని నిరాశపరిచింది. అయితే ప్రభాస్ కొంతమంది డైరెక్టర్స్ చేసే సినిమాల్లో చూడాలని ఫాన్స్ ఉబలాటపడుతుంటే, అది జరగడం లేదని అందరిలో నిరాశ ఉంది.

నిజానికి మిర్చి తర్వాత కొరటాల కాంబోలో మూవీ రావాలని ఫాన్స్ ఆశించారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చూడాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక సుకుమార్ చేతిలో పడితే ఎలా ఉంటుందా అని ఎదురుచూసారు. ఇవన్నీ ఇప్పట్లో సాధ్యపడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం రాధేశ్యాం మూవీ 80శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. లాక్ డౌన్ తో ఆగింది. ఇది కాకుండా వైజయంతి బ్యానర్ లో నాగ అశ్విన్ డైరెక్షన్ లో మూవీ ఏడాది పాటు షూటింగ్ ఉంటుంది.

ఆతర్వాత తాజాగా ప్రకటించిన హిందీ మూవీ ఆదిపురుష్ లో నటించాల్సి ఉంది. ఇలా మూడేళ్లపాటు ప్రభాస్ బిజీ అయ్యాడు. మొత్తానికి స్టార్ డైరెక్టర్స్ చుట్టూ కాకుండా ఒకటి రెండు సినిమాలే చేసిన యంగ్ డైరెక్టర్స్ ని మాత్రమే ఎంచుకుంటున్నాడు. ఆదిపురుష్ డైరెక్టర్ కి కూడా రెండు సినిమాల అనుభవమే ఉంది. మొత్తానికి క్రేజీ డైరెక్టర్స్ తో చూడాలన్న ఫాన్స్ ఆశ నెరవేరేలా లేదని క్లారిటీ వచ్చేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."