చిరంజీవి కెరీర్ లో ఎన్ని హిట్స్ ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో ఒకసారి లుక్ వేయండి
టాలీవుడ్ లో చిన్న పాత్రలతో ఎంట్రీ ఇచ్చి స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ఎందరికో ఆదర్శం. సెలబ్రిటీలకు కూడా స్ఫూర్తి. అందరినీ ఆప్యాయంగా పలకరించే మెగాస్టార్ ఇప్పుడు ఇండస్ట్రీకి కూడా పెద్ద దిక్కుగా ఉంటున్నారు. అందరివాడు అయ్యారు. ప్రాణం ఖరీదు చిత్రంతో మొదలైన ప్రయాణం 152సినిమాలకు చేరింది. రాజకీయాల్లోంచి ఇండస్ట్రీకి వచ్చి ఖైదీ నెంబర్ 150తో తన స్టామినా చూపించిన చిరు 60ఏళ్ళ వయస్సులో కూడా తన సత్తా చాటాడు. ఆతర్వాత సైరా మూవీతో హిస్టారికల్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం 153వ సినిమా సెట్స్ మీద ఉంది. లాక్ డౌన్ తో ఆచార్య మూవీ ఆగింది. మనవూరి పాండవులలో ఒక్కడిగా ఉన్నాడు. మంచి హిట్ అయింది. తాయారమ్మ బంగారయ్య ,ఐ లవ్ యు వంటి సినిమాలు తర్వాత పునాదిరాళ్ళు మూవీ పునాది వేసింది.
కోతలరాయుడు వంటి నాలుగు ప్లాప్ ల తర్వాత మోసగాడు హిట్ అయింది. ఇక పున్నమినాగు మూవీ మంచి పేరు తెచ్చింది. ఆతరవాత కొన్ని సినిమాల ప్లాప్ తర్వాత నెగిలెటివ్ షేడ్ లో వచ్చిన న్యాయం కావాలి మూవీ భారీ హిట్ ఇచ్చింది. ఊరికిచ్చిన మాట, రాణికాసుల రంగమ్మ వంటి సినిమాలు ప్లాప్ అవ్వగా, శ్రీరస్తు శుభమస్తు, ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్నయ్య, చట్టంతో పోరాటం కిరాయి రౌడీలు వంటి నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు.
శుభలేఖ మూవీ చిరంజీవిలో నటుణ్ని పైకి తెచ్చింది. తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు పోయాయి. పట్నం వచ్చిన పతివ్రతలు మూవీ హిట్ అయింది. భిల్లా రంగా యావరేజ్ గా నిలిస్తే,మంచుపల్లకి మంచి పేరు తెచ్చింది. అభిలాష సూపర్ హిట్ అయింది. తర్వాత గూఢచారి నెంబర్ వన్ హిట్ అయింది. ఇక మగమహారాజు చిరు కెరీర్ లో ఓ మైలురాయి. తర్వాత కొన్ని సినిమాలు ప్లాప్ కాగా ఖైదీ సినిమా చిరు కెరీర్ ని ఒక్కసారిగా మార్చేసింది. సంఘర్షణ,గుండా వంటి సినిమాలు హిట్. మధ్యలో అల్లుడొస్తున్నాడు మూవీ ప్లాప్ అయింది.
తర్వాత ఛాలెంజ్ మూవీ స్టార్ హీరోని చేసింది. కొన్ని సినిమాల ప్లాప్ తర్వాత వచ్చిన దొంగ మూవీ హిట్. జ్వాలా , రక్త సింధూరం,అడవి దొంగ,విజేత మంచి హిట్ ఇచ్చాయి. కొండవీటి రాజా మూవీ బ్లాక్ బస్టర్ అయింది. రాక్షసుడు హిట్ తర్వాత కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. పసివాడి ప్రాణం, స్వయంకృషి , దొంగమొగుడు,ఖైదీ నెంబర్ 786,త్రినేత్రుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు,స్టేట్ రౌడీ ,రుద్రనేత్ర, కొదమ సింహం,జగదేక వీరుడు అతిలోక సుందరి, కొండవీటి దొంగ ఇలా ఐదేళ్ల పాటు భారీ హిట్స్ దూసుకెళ్లి మెగాస్టార్ అయ్యాడు.
కొన్ని ప్లాప్ ల తర్వాత గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు,రౌడీ అల్లుడు వంటి మూవీస్ తో మళ్ళీ మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఆపద్భాంధవుడు మూవీతో సోలో హీరో అయ్యాడు. ముఠా మేస్త్రి,ముగ్గురు మొనగాళ్లు,అల్లుడా మజాకా, బిగ్ బాస్,రిక్షావోడు, మాస్టర్,బావగారు బాగున్నారా, చూడాలని ఉంది,స్నేహంకోసం అన్నయ,హిట్లర్ ,సినిమాలు హిట్ కొత్తగా, ఇంద్ర మూవీ రికార్డులు తిరగరాసింది. ఠాగూర్,శంకర్ దాదా ఎంబిబిఎస్,శంకర్ దాదా జిందాబాద్,స్టాలిన్,సినిమాలతో ఓ ఊపు ఊపేసారు.