Movies

ఘనంగా జరిగిన కమెడియన్ విద్యు రామన్ ఎంగేజ్మెంట్ వేడుక..ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరో తెలుసా?

ప్రస్తుతం సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అదరకొడుతూ కామెడీ కూడా పండిస్తూ అందరిని అలరిస్తున్న విద్యు రామన్ అనగానే గుండ్రని మొహంతో, లావుగా,బొద్దుగా చూడ్డానికి వెరైటీగా ఉంటుంది. ఇక ఈమె ను తెరమీద చూస్తే చాలు,నవ్వు పుట్టించే డైలాగ్స్ గుర్తొస్తాయి. అందుకే తెలుగు ,తమిళ సినీ రంగాల్లో మంచి నటిగా దూసుకెళ్తోంది. ఈమె అసలు పేరు విద్యుల్లత రామన్. అందరూ ముద్దుగా విద్యు రామన్ అని పిలుస్తారు.

స్టార్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. టాలీవుడ్ లో ఏం మాయ చేసావే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటించిన నిను కోరి,రాజా ది గ్రేట్,రామయ్య వస్తావయ్యా,రన్ రాజా రన్,సరైనోడు,రాజుగారి గది2, వంటి సినిమాల్లో కడుపుబ్బా నవ్వించింది. అలాంటి విద్యు రామన్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తాజాగా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది.

ఇందుకు సంబందించిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆగస్టు 26న విద్యు రామన్ ఎంగేజ్ మెంట్ జరిగినట్లు చెబుతున్నారు. గత కొద్దీ రోజులుగా రోకా శర్మ ప్రేమలో ఉన్న ఈమె ఎంగేజ్ మెంట్ ని అతికొద్ది సమక్షంలో చేసుకుందని తెలుస్తోంది. రోకా శర్మ, విద్యు రామన్ ఫార్మల్ ఎంగేజ్ మెంట్ అంటూ ఉంగరాలు మార్చుకున్నారు. అంతేకాదు అంతకుముందు వెయిట్ లాస్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో చూడ్డానికి ఇద్దరూ క్యూట్ గా కనిపిస్తున్నారని కామెంట్స్ వస్తున్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."