Movies

హలో సినిమాలో చిన్నప్పటి అఖిల్ గా నటించినది ఎవరో తెలుసా ?

అఖిల్ హీరోగా వచ్చిన ‘హలో’ సినిమాలో అఖిల్ చిన్నప్పటి పాత్రను వేసింది మైఖేల్ గాంధీనే. ఇప్పుడు మైఖేల్ గాంధీ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. సుప్రీం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినప్పుడు అతని వయస్సు కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే. మైఖేల్ చాలా యాడ్స్ లో నటించాడు. అయినా యాడ్స్ కన్నా సినిమాలే ఇష్టమని చెపుతున్నాడు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ బయో పిక్ తీస్తున్న సమయంలో సచిన్ చిన్నప్పటి పాత్ర కోసం చాలా వడపోతల తర్వాత మైకేల్ ని ఎంపిక చేసారు. ఆలా అతని సినిమా కల నిజమైంది. అయితే ఆ కల అంత సులువుగా నెరవేరలేదు. కొన్ని వేల మంది చిన్నారులలో మైకేల్ సెలక్ట్ అయ్యాడు. బిలియన్ డ్రీమ్స్ సినిమా ప్రమోషన్ కి మైఖేల్ ఎక్కడికెలితే అక్కడ జనం ఎగబడ్డారు. సచిన్ బయో పిక్ లో తన నటనతో అందరిని ఆకట్టుకోవడంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

సుప్రీమ్ ,బిలియన్ డ్రీమ్స్ సినిమాలో మైఖేల్ నటన చూసిన నాగార్జున ఫిదా అయ్యిపోయి హలో సినిమాలో అఖిల్ చిన్నప్పటి పాత్రకు సెలక్ట్ చేసాడు. హలో సినిమాలో మైకేల్ నటన చూసిన వారంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 8 సంవత్సరాలకే నటనతో అందరిని ఆకట్టుకున్న మైకేల్ గాంధీకి హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయని చూసిన వారందరు అంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."