Movies

అమ్మ రాజశేఖర్ ఫ్యామిలీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు

గ్రాండ్ గా లాంచ్ అయిన బిగ్ బాస్4సీజన్ రియాల్టీ లో 16కంటెస్టెంట్స్ ఎంటరయ్యారు. ఇందులో కొరియోగ్రాఫ‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారిన అమ్మ రాజ‌శేఖ‌ర్ ఉన్నాడు. పరిచయం సందర్బంగా గ‌త సీజ‌న్‌లో త‌న శిష్యుడు బాబా భాస్క‌ర్ వ‌చ్చార‌ని, ఇప్పుడు తాను రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. వస్తూనే ఈ సాంగ్‌ నాగార్జునకు డెడికేట్‌ చేస్తున్నా అంటూ కింగ్ సినిమాలోని ఓ పాటకు స్టెప్పులేశాడు.

గోపిచంద్‌ ‘రణం’, రవితేజ ‘ఖతర్నాక్’‌, నితిన్‌’ టక్కరి’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆన్‌స్క్రీన్‌ మీదే కాదు. ఒకటి, రెండు వివాదాలతో ఆఫ్‌ స్క్రీన్‌ మీద కూడా పాపులర్‌ అయ్యాడు. తమిళ మూవీస్ కి డైరెక్షన్ చేసాడు. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే, ఇతడి భార్య పేరు జీవిత. ఈమె ఒక ప్రముఖ మోడల్. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు.

ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడడం,మరోసారి జిమ్ ట్రైనర్ పై చేయిచేసుకోవడంతో వివాదాలతో వార్తలకెక్కాడు. 16 ఏళ్లుగా సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్నాన‌ని రాజ‌శేఖ‌ర్ చెబుతూ . డైరెక్ట‌ర్‌గా వ‌చ్చి నెంబ‌ర్ వ‌న్‌గా నిల‌వానుకుంటున్నాన‌ని మ‌న‌సులోని కోరిక‌ను బయటపెట్టాడు. కానీ రణం బ్లాక్ బస్టర్ కొట్టినప్పటికీ మిగిలిన చిత్రాలు అంతగా ఆడకపోవడంతో డైరెక్టర్ గా ఛాన్స్ లు తగ్గాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."