బిగ్ బాస్ షో లో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నది ఎవరో తెలుసా ?
బుల్లితెరలో రియాల్టీ షోలలో బిగ్బాస్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ఒక రకమైన క్రేజ్ కూడా ఉంది. చాలా మంది బిగ్ బాస్ ఒకపక్క తిడుతూ మరోపక్క చూస్తూనే ఉంటారు. బిగ్ బాస్ షో పెద్దగా పరిచయం లేని వారిని కూడా సెలబ్రిటీ గా మారుస్తుంది ప్రతి వారం ఎలిమినేషన్ ఉంటుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారో అని బిగ్బాస్ వీక్షకులు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. ఈసారి బిగ్ బాస్ షోలో తెలిసిన వారు ఉన్నారు తెలియని వారు ఉన్నారు. ఈసారి బిగ్ బాస్ షో లో 16మంది కంటెస్టెంట్ లలో అమ్మాయిలు తొమ్మిది మంది ఉండగా అబ్బాయిలు ఏడుగురు మాత్రమే ఉన్నారు.
ఈవారం సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే బిగ్ బాస్ షోలో అత్యధిక పారితోషికం ఎవరు తీసుకుంటున్నారు అనే విషయానికి వస్తే బుల్లితెర యాంకర్ లాస్య రోజుకు లక్ష రూపాయలు చొప్పున తీసుకుంటుందట. ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని రోజులు ఉంటే అన్ని లక్షలు ఆమెకు సొంతం అవుతాయి. ఆ తర్వాత ఆ స్థాయిలో మోనాల్ పారితోషికం తీసుకుంటోందని సమాచారం. నోయల్, హారిక, అమ్మ రాజశేఖర్ రోజుకి 50 వేలు వరకు తీసుకుంటున్నారని సమాచారం. మిగిలిన వారికి చాలా తక్కువ ఇస్తున్నారట.
