Beauty Tips

Egg For Face:గుడ్డు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా….ఎలానో తెలుసా ?

Egg For Face Home Remedies:పాలు ,గుడ్లు శరీర ఆరోగ్యానికే కాకుండా శిరోజాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ రెండూ ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపుతాయో,జుట్టు మీద కుడా అంతే ప్రభావం చూపుతాయని చెప్పవచ్చు.

మార్కెట్ లో దొరికే ఉత్పత్తుల మీద ఆధారపడడం కన్నా ఇంట్లో లభించే వస్తువలతోనే జుట్టును నిగనిగలాడుతూ మెత్తగా, అందంగా చేసుకోవచ్చు.గుడ్డుకి చిన్న రంధ్రం పెట్టి తెల్ల సొనను వేరు చేసుకోవాలి. దీనికి కొన్ని పాలను కలిపి బాగా గిలకొట్టాలి. పాలు,తెల్ల సొన బాగా కలిసిన తరువాత ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్,చిటికెడు చక్కెర జత చేసి చక్కెర కరిగేంత వరకు కలపాలి.

ముందుగా జుట్టుని షాంపూ తో శుభ్రం చేసుకొని తడి లేకుండా ఆరపెట్టుకుని అనంతరం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంఛి మొత్తం పట్టించాలి. ఇప్పుడు దువ్వెనతో జుట్టంతా కలిసేలా సున్నితంగా దువ్వాలి. ఏదో ఒకసారి దువ్వేసి వదిలిపెట్టుకుండా కనీసం ఏడు నుండి ఎనిమిది నిముషాలు పాటు జుట్టును దువ్వుకోవాలి.

జుట్టు ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఆయితే ఆలివ్ ఆయిల్ని కలిపేటప్పుడు ఎక్కువ కలపకూడదు. ఆలివ్ ఆయిల్ కండీషనర్ గా పని చేస్తే జుట్టుని చల్లగా ఉంచుతుంది. గుడ్డు,పాలు కలిపి మసాజ్ చేయడం వల్ల జుట్టు కొద్దిగా వాసన వచ్చే అవకాశం ఉంది.

ఇది ఇష్టపడని వాళ్ళు తల స్నానానికి ముందు పాలను జుట్టుకు పట్టించి ఎండిన తరువాత షాంపూ తల స్నానం చేసినా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."