పవన్ హీరోయిన్ పరిస్థితి ఇలా అయిందేమిటి పాపం…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?
ప్రస్తుతం లండన్ లో ప్రముఖ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటున్న హీరోయిన్ నిఖిషా పటేల్ హాలీవుడ్ మూవీస్ లో చేయాలని భావిస్తోందట. నిజానికి తెలుగులో పులి సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జోడీ కట్టిన ఈమె రెండు మూడు సినిమాలతోనే ఛాన్స్ లు దక్కించుకోలేక పోయింది.
నందమూరి కళ్యాణ్ రామ్ తో కూడా నటించి ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇండస్ట్రీకి దూరం జరిగింది. దాంతో ఇండియా వదిలేసి తాను పుట్టిన లండన్ వెళ్ళిపోయింది. అక్కడ నటనలో తర్ఫీదు పొందుతోందట.
నిజానికి ఎస్ జె సూర్య డైరెక్ట్ చేసిన పులి మూవీ2010లో రిలీజై డిజాస్టర్ అయింది. ఆ సినిమాతోనే నిఖిషా ఎంట్రీ ఇవ్వడం బాడ్ అయింది. తొలిమూవీతోనే పవన్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఈమె ఈ మూవీ దెబ్బతిన్నాక ఓం త్రీడి , అరకు రోడ్డులో వంటి మూవీస్ చేసినప్పటికీ అవి కూడా ఘోరంగా దెబ్బతిన్నాయి.

