Movies

దిల్ రాజు ఎంత మంది దర్శకులను టాలీవుడ్ కి పరిచయం చేసాడో తెలిస్తే అవ్వాలసిందే

ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చేవారు. అలా చాలామంది సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చి స్టార్ డైరెక్టర్స్ అయ్యారు. అందులో బి గోపాల్ ఒకరు. ఇక ఇప్పటితరంలో దిల్ రాజు కూడా ఎంతోమంది డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చారు. చాలామంది స్టార్ డైరెక్టర్స్ అయ్యారు. ఎక్కువమంది దిల్ తర్వాత సరైన కథ కోసం చూస్తున్న ఆర్యతో అదిరిపోయే స్టోరీ ఇచ్చిన లెక్కల మాస్టారు సుకుమార్ చెప్పిన దాన్ని విశ్వాసంలోకి తీసుకున్న దిల్ రాజు, వెంటనే బన్నీతో మూవీ చేసి,బ్లాక్ బస్టర్ కొట్టాడు. అలా సుకుమార్ టాలీవుడ్ లో ఎంటర్ అయ్యాడు. ఇక అప్పటికే దిల్ రాజు సినిమాలతో అసిస్టెంట్ గా చేస్తూ వస్తున్న బోయపాటి శ్రీను కూడా ఈయన బ్యానర్‌లోనే దర్శకుడిగా తొలి సినిమా భద్ర తో ఎంట్రీ ఇచ్చాడు.

దాని తర్వాత టాప్ డైరెక్టర్ గా మారిన బోయపాటి శ్రీను వినయ విధేయ రామ తో తేడాకొట్టి ఇప్పుడు హిట్ కోసం చూస్తున్నాడు. దిల్ సినిమాతో రాజు… దిల్ రాజుగా మారితే ,ఆయన చేసిన సినిమాతోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి అదే సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. దిల్ రాజు వల్లే భాస్కర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. మున్నా సినిమాతో వంశీ పైడిపల్లిని దిల్ రాజు పరిచయం చేసాడు. సినిమా ఏవరేజ్ గా ఉన్నా .. వంశీ మాత్రం ప్రస్తుతం మంచి పొజిషన్ లో ఉన్నాడు. అయితే లెక్కలన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవన్నట్లు దిల్ రాజు పరిచయం చేసిన దర్శకుడు వాసు వర్మ మాత్రం ఫెయిల్ అయ్యాడు. వాసువర్మ తెరకెక్కించిన జోష్ సినిమా ప్లాప్ అయింది. నాగ చైతన్య హీరోగా చేసాడు. ఆ తర్వాత సునీల్ హీరోగా వచ్చిన కృష్ణాష్టమి అంతే.

కాగా హ్యాపీ డేస్ తర్వాత వరుణ్ సందేశ్ తో కొత్త బంగారు లోకం సినిమా దిల్ రాజు చేసాడు. శ్రీకాంత్ అడ్డాలకు డైరెక్టర్ గా ఛాన్స్ ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అయింది. ఓ మై ఫ్రెండ్ మూవీతో డైరెక్టర్ వేణు శ్రీరామ్ కి దిల్ రాజు లైఫ్ ఇచ్చాడు. అంతేకాదు, ఆరేళ్ళ తర్వాత మరోసారి వేణును నమ్మి ఎంసిఏ మూవీతో ఛాన్స్ ఇచ్చాడు. ఇదీ హిట్ అయింది. ఇక దర్శకుడు రవి యాదవ్ తీసిన మరో చరిత్ర దారుణంగా దెబ్బతింది. ఇక తమిళనాడులో సంచలన చలన విజయం సాధించిన 96 సినిమాను తెలుగులో జాను పేరుతో దిల్ రాజు రీమేక్ చేస్తూ, ప్రేమ్ కుమార్‌ను తెలుగు తెరకు డైరెక్టర్ గా పరిచయం చేసాడు. కరోనా లాక్ డౌన్ లేకుంటే ఇంకా కొందరికి ఛాన్స్ ఉండేది. ప్రస్తుతం వి మూవీ ఓటిటి లో రిలీజ్ చేసి బాగానే సొమ్ము చేసుకున్న దిల్ రాజు.. పింక్ హిందీ మూవీ రీమేక్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.