Movies

“వి” సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందా…లేదా…?

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా నాని సుధీర్ బాబు కీలక పాత్రలో నటించిన వి సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది.ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసిన సమయంలోని కరోనా రావడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. ఆరు నెలలు అయినా పరిస్థితిలో మార్పు రాకపోవటంతో అమెజాన్ వారికి ఈ సినిమాను అమ్మేశారు. ఈ సినిమాను అమ్మిన అప్పుడే అమెజాన్ వారితో థియేటర్ రిలీజ్ కు సంబంధించి కూడా దిల్రాజు ఒప్పందం చేసుకున్నాడట.

ఈ సినిమాను బి సి సెంటర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. తన దగ్గర ఉన్న థియేటర్స్ లో రిలీజ్ చేసిన ఎంతోకొంత అమౌంట్ వస్తుంది అని దిల్ రాజు భావిస్తున్నాడట. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ప్రారంభించాడట. అయితే ఈ సినిమా కొంచెం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మరి థియేటర్స్లో రిలీజ్ అయితే సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో అని సందేహాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తపరిచారు అట. దాంతో దిల్ రాజు వి సినిమాను థియేటర్స్ లో విడుదలకు ఆలోచనలో పడ్డాడట. అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్స్ ఓపెన్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి విపరీతమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. మరి ఏమి జరుగుతుందో చూద్దాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."