రెమ్యునరేషన్ లో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్స్ ….ఎన్ని కోట్లో తెలుసా ?
వరుస హిట్స్ తో ఇండస్ట్రీలో నిలదొక్కుకుని స్టార్ స్టేటస్ సాధించిన తర్వాత స్టార్ హీరోయిన్లు ఎక్కువ కాలం ఉండడంలేదు. గతంలో అయితే పాతికేసి సినిమాలు జంటగా చేసి హిట్ ఫెయిర్ గా ఉండేవారు. కానీ మారుతున్న కాలంలో రోజకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తోంది. దాంతో అన్ని ఇండస్ట్రీలో కన్నా టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. కానీ ఇందులో స్టార్ హీరోయిన్స్ తక్కువ మందే ఉన్నారు. దాంతో క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకోవాలన్న అభిప్రాయం సహజమే. ఇక గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా లేడీ డామినేషన్, లేడీ ఓరియెంటెడ్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. హీరోలతో సమానంగా పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు.
స్టార్ హీరోయిన్స్ డిమాండ్ ఎలా ఉందొ ఒక్కసారి చూస్తే, .. అక్కినేని సమంత, అనుష్క, పూజాహెగ్డే, కాజల్ అగర్వాల్ , తమన్నా స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. ఇందులో స్వీటీ అనుష్క గ్లామర్ హీరోయిన్ గానే కాదు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ .. హీరో లేకున్నా పర్వాలేదని ఇమేజ్ తెచ్చుకుంది. అందుకే ఈ అమ్మడు ఒక్కో సినిమాకు దాదాపు 3 కోట్ల వరకు తీసుకుంటుందని టాక్. ఇక సమంత పెళ్లైన తర్వాత కూడా వరుస ఆఫర్స్ తో దూసుకెళ్తోంది. ఒక్కో సినిమాకు 2.5 నుంచి 3 కోట్ల వరకు అందుకుంటోంది. ఈ ఏడాది సంక్రాంతికి అలవైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ లో లక్కీ స్టార్ హీరోయిన్ గా పిలవబడుతున్న పూజాహెగ్డే డిమాండ్ పెంచేసిందని టాక్. ఈ భామ ఒక్కో సినిమాకి 2 నుంచి 2.5 కోట్ల వరకు తీసుకుంటోందట
పూజలతో సమానంగా దూసుకెళ్తున్న రష్మిక మందన్నా తో పాటు కీర్తి సురేష్ , సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, రాశిఖన్నా కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సినిమాని బట్టి కోటి పైనే అందుకుతున్నట్లు టాక్. కాజల్ అగర్వాల్ , అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా బిజీగా ఉంటూ, ఒక్కొక్క సినిమాకి 1 నుంచి 1.5 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నివేదా థామస్ – నిధి అగర్వాల్ – నభా నటేష్ – అదితి రావు హైదరీ – పాయల్ రాజ్ పుత్ లు 60 లక్షల నుంచి 80 లక్షల మధ్య అందుకుంటు న్నారని టాక్. అయితే ప్రస్తుతం కారోనా కాలం కనుక ఇండస్ట్రీ నష్టపోవడంతో రెమ్యున రేషన్ తగ్గించుకోడానికి మా అసోసియేషన్ కి,ప్రొడ్యూసర్స్ గిల్డ్ కి ఒప్పందం కుదరడంతో పారితోషికం తగ్గించుకుంటేనే ఆఫర్స్ వస్తాయన్నది వాస్తవం. చూడాలి ఎలా చేస్తారో.

