నాగార్జున ఆ ఆరోగ్య సమస్యలతో నరకం చూశాడట… అవి ఏమిటో?
టాలీవుడ్ లో ఆరుపదుల వయసులో యంగ్ గా కనిపిస్తూ ఒక వైపు సినిమాలు మరోవైపు బుల్లి తెర మీద తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నాడు ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో తనకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకొచ్చాడు. కొన్ని సంవత్సరాల క్రితం మోకాళ్ళ నొప్పులు నడుం నొప్పి విపరీతంగా భావించారట. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదట
సినిమాల్లో ఫైట్స్ డాన్స్ చేయడం వలన ఈ సమస్యలు వచ్చాయని, స్నేహితుల సూచనతో స్ట్రెంత్ ట్రైనింగ్ చేసి ఆ సమస్య నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చాడు. ఫిట్ గా ఉండటం అంటే శారీరకంగా ఫిట్ గా ఉండటమే కాకుండా మానసికంగా కూడా ఫిట్ గా ఉండాలని చెప్పాడు. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు మరోవైపు బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు

