Kitchen

శీతాకాలంలో పెరుగు తోడుకోవడానికి సింపుల్ చిట్కా…

వంట చేయడం రానివాళ్లు కూడా ఈజీగా చేసే పని ఏదన్నా ఉందా అంటే పెరుగు తోడు పెట్టడం…వేడి అన్నం వండుకుని ,పెరుగు తోడు పెట్టుకుని,ఆవకాయ నంజుకు తింటే ఆ టేస్టే వేరు…కానీ పెరుగు తోడు పెట్టడం ఎంత ఈజీనో…కానీ కొన్ని సార్లు పెరుగు సరిగా తోడుకోదు…లేదంటే పులిసిపోయినట్టు గా ఉంటుంది…..శీతాకాలంలో పెరుగు సరిగా తోడుకోదు దానికోసం చిన్న చిట్కా పాటిస్తే చాలు..అదేంటంటే..

శీతాకాలంలో పెరుగు తోడు పెట్టడానికి గోరు వెచ్చటి పాలలోనే తోడు వేయాలి…అలాకాకుండా చల్లటి పాలలో తోడు పెడితే అది పాలులానే ఉంటుంది…అలాంటప్పుడు తోడుపెట్టినా తోడుకోకుండా ఉన్న పాలగిన్నెని,ఒక ప్లేట్లో గోరువెచ్చటి నీరు తీసుకుని అందులో పెట్టాలి.తీయటి పెరుగు చిటికెలో తోడుకుంటుంది.ట్రై చేసి చూడండి.

మిగిలిపోయిన పెరుగు మొత్తంలో పాలు పోసేస్తుంటారు చాలామంది…అలా చేయడం వల్ల పెరుగు పుల్లగా తోడుకుంటుంది.అలాకాకుండా స్పూన్ తో కొంచెం పెరుగు తీసుకుని,పాలల్లో కలిపేస్తే తీయటి పెరుగు తోడుకుంటుంది…

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."