లాక్ డౌన్ లో సమంత ఎన్ని కోట్లు సంపాదించిందో తెలిస్తే షాక్ అవ్వాలసిందే
samantha lock down earnings :స్టార్ హీరోయిన్ గా తెలుగులో తనకంటూ ఓ స్పెషల్ స్టేటస్ తెచ్చుకున్న సమంత పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత కూడా సినిమాల్లో ఏమాత్రం పాపులార్టీ తగ్గకుండా దూసుకెళ్లింది. అందం అభినయం పుష్కలంగా ఉన్న ఈ భామ ఇక రెమ్యునరేషన్ లో కూడా పెంపుదల చూపిస్తూ విజయాలను నమోదు చేసుకుంది. ఇక అక్కినేని కోడలు సమంత సోషల్ మీడియాలో కూడా తన హవా సాగిస్తోంది. లాక్డౌన్ సమయానికి చాలా ముందుగానే వెండితెరకు విరామం ప్రకటించినప్పటికీ స్టార్ హీరోయిన్ సమంత పాపులారిటీ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
ఇక కింగ్ నాగార్జున `బిగ్‌బాస్-4`సీజన్ కి హోస్ట్ చేస్తున్నాడు. వైల్డ్ డాగ్ షూటింగ్ కారణంగా బిగ్ బాస్ కి గ్యాప్ ఇవ్వాల్సి వస్తే, ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన సమంత మంచి మార్కులు కొట్టేసింది. అలాగే త్వరలో `ఫ్యామిలీ మేన్-2` వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య తాజగా 13 మిలియన్ల (1.30 కోట్లు)ను దాటింది. లాక్డౌన్ సమయంలో సమంత ఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఆమె ఫాలోవర్ల సంఖ్య మరింత పెంచుకోవడమే కాదు, లక్షలకు లక్షలు కూడా ఆర్జిస్తోంది. బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ద్వారా 5కోట్లు కంటే ఎక్కువే సంపాదించిందని టాక్.