Health

వేగంగా బరువు తగ్గాలంటే ఇవి తప్పనిసరి….Foods

Weight Loss Foods :ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తుంది.అయితే అధిక బరువు సమస్య ఎక్కువగా మహిళల్లో కనబడుతుంది. అధిక బరువు కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మనకు వచ్చే అనారోగ్య సమస్యల్లో 84% అధిక బరువు కారణంగా వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ముందుగా మనం బరువు తగ్గే ప్రక్రియను ప్రారంభించాలి. దీనికోసం కొన్ని ఆహారాలను మన డైట్ లో చేర్చుకోవాలి. వాటి గురించి చూద్దాం.

వెల్లుల్లి
వెల్లుల్లిలో ఉండే విటమిన్ బి 6, విటమిన్ సి, ఫైబర్ అనేవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. రోజుకి ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బ తీసుకుంటూ ఉంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగి అధిక బరువు సమస్య నుంచి బయట పడతారు.

క్యారెట్
ప్రతి రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తీసుకుంటే బరువు తగ్గటమే కాకుండా అలసట నిస్సత్తువ లేకుండా రోజంతా ఎనర్జీతో ఉంటారు. అంతేకాకుండా ఆకుకూరలను కూడా తరచుగా తీసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండి తొందరగా ఆకలి వేయదు

అలాగే యాపిల్ స్ట్రాబెర్రీ వంటి పండ్లను కూడా తీసుకోవాలి. ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలిపి తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది.ఇలా డైట్ తీసుకుంటూ రోజుకి కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయాలి. అప్పుడే బరువు తగ్గుతారు.