Healthhealth tips in telugu

Headache:కేవలం ఒక్క నిమిషంలో ఎటువంటి తలనొప్పిని అయినా తగ్గించే మసాజ్ ట్రిక్

Headache massage points:మనలో ఎక్కువ మందిని తరచూ వేధించే ప్రధాన ఆరోగ్య సమస్య ‘తల నొప్పి’. మానసిక ఆందోళన, ఒత్తిడి, నిద్ర లేమి వంటి కారణాల వల్లే ఎక్కువగా తల నొప్పి వస్తుంటుంది. తల నొప్పి వస్తే ఓ పట్టాన తగ్గదు. అదే.. మైగ్రేన్ లేదా సైనస్ వంటివి వస్తే ఇక నరకమే.

నిజానికీ తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, సరిలేని ఆహారం, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, కళ్ళు అదే పనిగా చూడడం, హైబీపీ, మైగ్రేన్స్, సైనస్, జలుబు, ధూమపానం, కాలుష్యం.. ఇవన్నీ కూడా తలనొప్పికి కారణాలే.

కూర్చున్న చోటే కూర్చుని, మసాజ్ ద్వారా వెంటనే రిలాక్స్ అవ్వడానికి ఒక టెక్నిక్. మీ మనస్సులో ఏ మాత్రం టెన్షన్ అనిపించినా… రిలాక్స్ అవ్వలనిపించినా వెంటనే ఈ టెక్నిక్ ప్రయోగించచ్చు. జస్ట్ మీ నుదుటి పై బొట్టు పెట్టుకునే భాగంలో మన చేత్తో మసాజ్ చెయ్యగలిగితే వెంటనే స్ట్రెస్ నుండి బయట పడొచ్చు.

ఇలా చెయ్యడం వల్ల రిలాక్స్ అవ్వడమే కాదు, కాన్సంట్రేషన్ పెరగడం, తల నొప్పి తగ్గడం, కంటి భాగం దగ్గరి చర్మాన్ని రిలాక్స్ చెయ్యడం లాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి.

మసాజ్ ఎలా చేయాలంటే ?

మీ కనురెప్పలు కరెక్ట్ గా మధ్యలో ఉన్న భాగాన్ని ఏదైనా ఒక వేలితో సున్నితంగా నొక్కి పట్టుకోవాలి.

అక్కడ నుంచి పైకి మూడు సెంటిమీటర్లదాక వేలితో స్పృసిస్తూ మెల్లగా మసాజ్ చెయ్యాలి

అలా ఒక నిమిషం వరకు చేసినా చాలు వెంటనే రిజల్ట్ కనపడటం మొదలవుతుంది. వెంటనే రిలాక్స్ అయ్యిన ఫీలింగ్ ఉంటుంది.

ఇలా చేస్తే మెదడులోని నర్వస్ టెన్షన్ తగ్గించే భాగం ఇందువల్ల యాక్టివేట్ అవుతుంది. అంతే కాదు కంటి దగ్గర కనిపించే తీరు కూడా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."